Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_gossips/socialstars-lifestyle86e2df07-e19d-490d-b9ec-879b2bb27fec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_gossips/socialstars-lifestyle86e2df07-e19d-490d-b9ec-879b2bb27fec-415x250-IndiaHerald.jpgబర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్..పొలిటికల్ సెటైరికల్ మూవీగా ఈ మూవీ తెరకెక్కింది.పూజా అపర్ణ కొల్లూరు ఈ మూవీ ద్వారా దర్శకురాలిగా పరిచయమైంది.ఈ మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో సంపూర్ణేష్ బాబుతోపాటు వెంకటేశ్ మహా, నరేష్ మరియు శరణ్య ప్రదీప్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్మరణ్ సాయి ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. వైనాట్ స్టూడియోస్, రిలయెన్స్ ఎంటర్‌టైన్మెంట్ మరియు వెంకటేశ్ మహాకు చెందిన మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి.ఈ సినిమా socialstars lifestyle{#}Naresh;allari naresh;aparna;pradeep;sampoornesh babu;king;Remake;King;Athadu;yogi babu;tuesday;Yevaru;Kannada;Cinema;Novemberఓటీటీ లోకి రాబోతున్న బర్నింగ్ స్టార్ సంపూ మూవీ...!!ఓటీటీ లోకి రాబోతున్న బర్నింగ్ స్టార్ సంపూ మూవీ...!!socialstars lifestyle{#}Naresh;allari naresh;aparna;pradeep;sampoornesh babu;king;Remake;King;Athadu;yogi babu;tuesday;Yevaru;Kannada;Cinema;NovemberTue, 21 Nov 2023 22:17:00 GMTబర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ  మార్టిన్ లూథర్ కింగ్..పొలిటికల్ సెటైరికల్ మూవీగా ఈ మూవీ తెరకెక్కింది.పూజా అపర్ణ కొల్లూరు ఈ మూవీ ద్వారా దర్శకురాలిగా పరిచయమైంది.ఈ మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో సంపూర్ణేష్ బాబుతోపాటు వెంకటేశ్ మహా, నరేష్ మరియు శరణ్య ప్రదీప్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్మరణ్ సాయి ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. వైనాట్ స్టూడియోస్, రిలయెన్స్ ఎంటర్‌టైన్మెంట్ మరియు వెంకటేశ్ మహాకు చెందిన మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి.ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన మండేలా సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. మండేలా సినిమాలో యోగి బాబు చేసిన పాత్రను మార్టిన్ లూథర్ కింగ్ లో సంపూర్ణేష్ బాబు నటించారు.అక్టోబర్ 27న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.తాజాగా ఈ సినిమా సోనీలివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతుంది.మార్టిన్ లూథర్ కింగ్ మూవీ నవంబర్ 29 నుంచి స్ట్రీమ్ అవనున్నట్లు సోనీలివ్ ఓటీటీ మంగళవారం (నవంబర్ 21) నాడు వెల్లడించింది. "ఒక్క ఓటు విలువ ఎంతో చాటి చెప్పే చమత్కారమైన పొలిటికల్ సెటైర్ మూవీ. మార్టిన్ లూథర్ కింగ్ మూవీని నవంబర్ 29 నుంచి సోనీలివ్ లో చూడండి. తెలుగుతోపాటు హిందీ, మలయాళం, కన్నడ మరియు తమిళంలోనూ స్ట్రీమ్ కానుంది" అని సోనీలివ్ పోస్ట్ చేసింది.ఈ సినిమా కథ విషయానికి వస్తే పడమరపాడు అనే ఊరికి చెందిన స్మైల్ (సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టుకుంటూ బతుకుతుంటాడు. ఊరిలో జరిగిన ఎన్నికల్లో స్మైల్ ఓటు ఎంతో కీలకంగా మారుతుంది. అతడు ఓటు వేసిన వారే గెలిచే అవకాశం ఉండటంతో స్మైల్ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది. అతడికి మార్టిన్ లూథర్ కింగ్ అని ఎవరు పేరు పెట్టారు. ఇంతకీ తన ఓటును స్మైల్ ఎవరికి వేశాడు అన్నదే ఈ సినిమా కథ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>