Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india5210b87d-028a-4ea4-bba5-148db4162b79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india5210b87d-028a-4ea4-bba5-148db4162b79-415x250-IndiaHerald.jpgనవంబర్ 19.. ఆదివారం రోజున 140 కోట్ల భారతీయుల గుండె బద్దలైంది. ఆ విచారాన్ని ఎవరితో పంచుకోవాలో కూడా తెలియని స్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎవరైనా నార్మల్ గా ఉంటే.. వారితో విచారాన్ని చెప్పుకోవచ్చు. కానీ ఇక అందరూ అదే బాధలో ఉంటే ఇక ఒకరి బాధను మరొకరికి చెప్పుకోవడానికి ఏముంటుంది. ఇలా యావత్ భారతం మొత్తం ఒక్కసారిగా నిరాశలో మునిగిపోయింది. ఎందుకు మనకే ఇలా జరుగుతూ వస్తుంది.. ఒక్కసారైనా మా కల నెరవేరదా అని అందరూ తెగ భాద పడిపోయారు. ఇంతకీ ఇలా అందరూ బాధపడటానికి కారణం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ నవంబర్ 19వ తేదీన అIndia{#}Sucide;Heart;Ahmedabad;World Cup;Narendra Modi;sunday;India;Novemberఫైనల్లో భారత్ ఓడిపోయిందని.. అతను చేసిన పనికి అందరూ షాక్?ఫైనల్లో భారత్ ఓడిపోయిందని.. అతను చేసిన పనికి అందరూ షాక్?India{#}Sucide;Heart;Ahmedabad;World Cup;Narendra Modi;sunday;India;NovemberTue, 21 Nov 2023 09:24:00 GMTనవంబర్ 19.. ఆదివారం రోజున 140 కోట్ల భారతీయుల గుండె బద్దలైంది. ఆ విచారాన్ని ఎవరితో పంచుకోవాలో కూడా తెలియని స్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎవరైనా నార్మల్ గా ఉంటే.. వారితో విచారాన్ని చెప్పుకోవచ్చు. కానీ ఇక అందరూ అదే బాధలో ఉంటే ఇక ఒకరి బాధను మరొకరికి చెప్పుకోవడానికి ఏముంటుంది. ఇలా యావత్ భారతం మొత్తం ఒక్కసారిగా నిరాశలో మునిగిపోయింది. ఎందుకు మనకే ఇలా జరుగుతూ వస్తుంది.. ఒక్కసారైనా మా కల నెరవేరదా అని అందరూ తెగ భాద పడిపోయారు. ఇంతకీ ఇలా అందరూ బాధపడటానికి కారణం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ నవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో.. జరిగిన  ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడమే.


 చిన్న పెద్ద అనే తేడా లేదు. యావత్ భారత్ మొత్తం భారత జట్టు గెలవాలని దేవున్ని మొక్కుకున్నారు. కానీ ఎందుకో ఆ దేవుడి అనుగ్రహం దక్కలేదు. ఫైనల్ మ్యాచ్లో గెలుపు కోసం పోరాడిన టీమిండియా ఓడిపోయింది. అంతకుముందు జరిగిన మ్యాచ్ లో బాగా రానించిన టీమ్ ఇండియా ఫైనల్ లో మాత్రం ఒత్తిడి ముందు లొంగిపోయింది. చివరికి ఇక ఐదు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియా.. ఆరోసారి వరల్డ్ కప్ టైటిల్ ను ముద్దాడింది. అయితే ప్రపంచకప్ మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తున్నాయి. కానీ ఇంకా ఈ బాధ నుంచి మాత్రం అస్సలు బయటపడలేకపోతున్నారు అభిమానులు.



 ఈ క్రమంలోనే భారత్ మ్యాచ్ ఓడిపోవడంతో ఏకంగా ఆ బాధను తట్టుకోలేక.. ఒక అభిమాని గుండె ఆగిన వార్త అందరిని కలిసివేసింది. అయితే ఇటీవల ఏకంగా ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓడిపోయిందని.. ఒక యువకుడు క్షణికావేశంలో సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన అసోంలోని గువహటిలో వెలుగులోకి వచ్చింది. ఐటిఐ విద్యార్థి ప్రొంజల్ నిన్న  కుటుంబీకులతో కలిసి మ్యాచ్ చూశాడు. అయితే ఇండియా ఓడిపోవడంతో బాధతో బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే కుటుంబీకులు వెళ్లి చూడగా ఇక ఉరివేసుకొని కనిపించాడు. కాగా విగత జీవిగా  కనిపించిన కుమారుడిని చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. దారుణంగా విలపించారు. అయితే ప్రొంజల్ కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబీకులు తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>