PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandra-babu-tdp-lokesh96448078-ecf0-4101-8aad-ae1c849b9bfa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandra-babu-tdp-lokesh96448078-ecf0-4101-8aad-ae1c849b9bfa-415x250-IndiaHerald.jpgతాము అధికారంలో ఉన్నపుడు వైసీపీ ఎంఎల్ఏలు, ద్వితీయ శ్రేణినేతలు, క్యాడర్ పైన కేసులు నమోదుచేసిన విషయాన్ని మాట్లాడటంలేదు. సరే ఎవరేమనుకున్నా టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ పైన కేసులు నమోదవుతున్నది మాత్రం వాస్తవం. అయితే టీడీపీలో పనిచేస్తున్న అందరు ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్ పైన కేసులు నమోదవ్వటంలేదు. కేవలం ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ళపైన మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. ఇపుడు నమోదైన కేసులు రాబోయే ఎన్నికల సమయంలో పార్టీకి పనిచేయటానికి పెద్ద అడ్డంకిగా మారుతుందనే అనుమానం పార్టీ అగ్రనేతల్లో మొదలైంది. అChandra Babu TDP Lokesh{#}Elections;Party;YCP;TDPఅమరావతి : టీడీపీ న్యాయపోరాటం మొదలుపెడుతోందా ?అమరావతి : టీడీపీ న్యాయపోరాటం మొదలుపెడుతోందా ?Chandra Babu TDP Lokesh{#}Elections;Party;YCP;TDPTue, 21 Nov 2023 09:00:00 GMTచంద్రబాబునాయుడు అరెస్టునుండి తెలుగుదేశంపార్టీ చేస్తున్నదిదే కదా అని అనుకుంటున్నారా ? నిజమే ఇపుడు చేస్తున్న పోరాటం చంద్రబాబును కేసుల్లో నుండి బయటపడేసేందుకు. కానీ ఇకనుండి చేయాలని అనుకుంటున్నది టీడీపీ క్యాడర్ కోసం. ఇంతకీ విషయం ఏమిటంటే షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నది. రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీని ధైర్యంగా ఎదుర్కోవాలంటే నేతలు, క్యాడర్లో  కేసులభయం పెరిగిపోతోంది. ఇప్పటికే చాలామంది ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ పైన అనేక కేసులున్నాయి.




ఇప్పటికి నమోదైన కేసుల్లో చాలావరకు వివిధ సందర్భాల్లో నమోదైనవే.  ఎలాగంటే గ్రామాలు,  మండలాలు లేదా నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ-టీడీపీ మధ్య జరిగిన ఆధిపత్య గొడవల వల్ల కేసులు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వ్యక్తిగత కక్షల కారణంగా దాడులు చేసుకున్నపుడు కూడా నమోదయ్యాయి. ఇలాంటి కేసులు టీడీపీ అధికారంలో ఉన్నపుడు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద కూడా చాలానే నమోదయ్యాయి.  ఇలాంటి కేసులన్నింటినీ టీడీపీ రాజకీయ కక్షపూరిత కేసులుగా ఆరోపణలు చేస్తోంది.




తాము అధికారంలో ఉన్నపుడు వైసీపీ ఎంఎల్ఏలు, ద్వితీయ శ్రేణినేతలు, క్యాడర్ పైన కేసులు నమోదుచేసిన విషయాన్ని మాట్లాడటంలేదు. సరే ఎవరేమనుకున్నా టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ పైన కేసులు నమోదవుతున్నది మాత్రం వాస్తవం. అయితే టీడీపీలో పనిచేస్తున్న అందరు ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్ పైన కేసులు నమోదవ్వటంలేదు. కేవలం ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ళపైన మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. ఇపుడు నమోదైన కేసులు రాబోయే ఎన్నికల సమయంలో పార్టీకి పనిచేయటానికి పెద్ద అడ్డంకిగా మారుతుందనే అనుమానం పార్టీ అగ్రనేతల్లో మొదలైంది. అందుకనే కేసులు నమోదైన వారికి న్యాయపరమైన సాయం అందించాలని పార్టీ తాజాగా డిసైడ్ చేసింది.




అందుకనే గ్రామాల వారీగా ఎవరెవరిపైన ఏ ఏ కేసులు నమోదయ్యాయి, వాటి తీవ్రత ఏమిటనే వివరాలను పార్టీ సేకరిస్తోంది. ఈ కేసులను సమీక్షించటం, అవసరమైన న్యాయ సహాయాన్ని అందించటం కోసం ప్రత్యేకంగా లాయర్ల బృందాలను ఏర్పాటుచేస్తున్నది. పార్టీవర్గాలైతే టీడీపీ నేతలు, క్యాడర్ పై 60 వేల కేసులు నమోదైనట్లు నానా గోలచేస్తున్నాయి. నిజంగానే అన్ని వేల కేసులు నమోదయ్యాయా ?  




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>