MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgమాస్ మహారాజ రవితేజ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఈ మూవీ లో చిరంజీవి హీరోగా నటించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి కి తమ్ముడు పాత్రలో రవితేజ నటించాడు. ఇక ఆ సినిమా తర్వాత రావణాసుర మూవీ లో సోలో హీరోగా నటించిన రవితేజ ఈ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహ పరిచాడు. ఇకపోతే తాజాగా రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" అనే సినిమాతో మరోసారి ప్రేRaviteja{#}Tammudu;Thammudu;Shruti Haasan;media;Makar Sakranti;Chiranjeevi;ravi teja;Ravi;Hero;Cinema;Box officeమూడోసారి ఆ క్రేజీ బ్యానర్లో రవితేజ..?మూడోసారి ఆ క్రేజీ బ్యానర్లో రవితేజ..?Raviteja{#}Tammudu;Thammudu;Shruti Haasan;media;Makar Sakranti;Chiranjeevi;ravi teja;Ravi;Hero;Cinema;Box officeMon, 20 Nov 2023 11:40:00 GMTమాస్ మహారాజ రవితేజ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఈ మూవీ లో చిరంజీవి హీరోగా నటించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి కి తమ్ముడు పాత్రలో రవితేజ నటించాడు. ఇక ఆ సినిమా తర్వాత రావణాసుర మూవీ లో సోలో హీరోగా నటించిన రవితేజమూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహ పరిచాడు.

ఇకపోతే తాజాగా రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం రవితేజ ఈగల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే రవితేజ తాజాగా ఓ క్రేజీ బ్యానర్ లో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం రవితేజ ధమాకా మూవీ తో సూపర్ హిట్ ను అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు నిర్మించారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న ఈగల్ సినిమాను కూడా ఈ బ్యానర్ వారే నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రవితేజ మూడవ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు ముగిసినట్లు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే నెలలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>