EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/elections672652db-fdb6-45fd-96ff-84076b990049-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/elections672652db-fdb6-45fd-96ff-84076b990049-415x250-IndiaHerald.jpgఎప్పుడూ లేని విధంగా ఈ సారి తెలంగాణలో రాజకీయాలు వేడేక్కాయి. తొలిసారి త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికల్లో పై చేయి సాధించాలని ఆయా పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందివచ్చిన అవకాశాన్ని వదులుకునేందుకు ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు. ప్రచార క్షేత్రంలో అన్ని పార్టీలు సమానంగా తలపడుతున్నా.. పోల్ మేనేజ్ మెంట్ లో అయినా తమ ఆధిపత్యం ప్రదర్శించేందుకు అన్ని పార్టీలు తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్ కూడా ఈ సారి పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి సారించింది. దీంతో పాటు ఇతర పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని తెలిస్తే చాలELECTIONS{#}KCR;TDP;politics;war;MLA;Congress;Party;Bharatiya Janata Partyతెలంగాణ: పోల్ మేనేజ్‌మెంట్‌లో ఎవరిది పైచేయి?తెలంగాణ: పోల్ మేనేజ్‌మెంట్‌లో ఎవరిది పైచేయి?ELECTIONS{#}KCR;TDP;politics;war;MLA;Congress;Party;Bharatiya Janata PartyMon, 20 Nov 2023 10:12:00 GMTఎప్పుడూ లేని విధంగా ఈ సారి తెలంగాణలో రాజకీయాలు వేడేక్కాయి. తొలిసారి త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికల్లో పై చేయి సాధించాలని ఆయా పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందివచ్చిన అవకాశాన్ని వదులుకునేందుకు ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు. ప్రచార క్షేత్రంలో అన్ని పార్టీలు సమానంగా తలపడుతున్నా.. పోల్ మేనేజ్ మెంట్ లో అయినా తమ ఆధిపత్యం ప్రదర్శించేందుకు అన్ని పార్టీలు తహతహలాడుతున్నాయి.


బీఆర్ఎస్ కూడా ఈ సారి పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి సారించింది. దీంతో పాటు ఇతర పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని తెలిస్తే చాలు అక్కడ వాలిపోయి గులాబీ కండువా కప్పుతున్నారు. మరోవైపు పార్టీ బలహీనంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను పిలిచి కేసీఆర్ పోల్ మేనేజ్ మెంట్ పై క్లాస్ ఇస్తున్నట్లు సమాచారం.


మరోవైపు కాంగ్రెస్ కూడా పోల్ మేనేజ్ మెంట్ లో దూకుడుగానే వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి తెలంగాణలో గెలిచే అవకాశాలు ఉన్నాయని భావించిన ఏఐసీసీ ఆ విధంగా వార్ రూమ్ లు ఏర్పాటు చేసి బూత్ స్థాయి నుంచి శిక్షణ ఇచ్చిందని సమాచారం. మరోవైపు పోల్ మేనేజ్ మెంట్ లో బీజేపీతో అందె వేసిన చేయి. మిగతా రెండు పార్టీలతో పోలిస్తే బీజేపీ ఈ అంశంలో చాలా దూకుడుగానే ఉంటుంది.


అయితే పోల్ మేనేజ్ మెంట్ వ్యవహారంలో అధికార పార్టీకి కొంత వెసులుబాటు ఉంటుంది. అది కేంద్రమైనా.. రాష్ట్ర మైనా.. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ తో పోల్చితే కాంగ్రెస్ కొంత వెనుకబడే ఉండే అవకాశాలే ఎక్కువ.  ఎన్నికల చివరి రెండు రోజుల్లో పోల్ మేనేజ్ మెంట్ చాలా కీలకమైంది. ప్రజలు ముందుగానే ఏ పార్టీకి ఓటు వేయాలని డిసైడ్ అయితే ఇవి పనిచేయవు.  ఉదా కర్ణాటక, దిల్లీ లో బీజేపీ, ఏపీలో టీడీపీ అధికారంలో ఉండి పోల్ మేనేజ్ చేసినా ఆ పార్టీలు ఓడిపోయాయి. కాబట్టి ప్రజలు ముందుగానే ఓ నిర్ణయానికి వస్తే చేసేది ఏం ఉండదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>