Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/k9hli4dc5bfb0-e5ff-4ac6-9cdf-d1a088bd57a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/k9hli4dc5bfb0-e5ff-4ac6-9cdf-d1a088bd57a8-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ప్రస్తుతం ఒకే విషయం గురించి చర్చించుకుంటున్నారు. అదే ఇటీవల అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీం ఇండియా ఓటమి గురించి. ప్చ్.. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచి ఉంటే ఎంత బాగుండేదో అని ఎంతోమంది నిరాశలు మునిగిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. కానీ జరిగిందానిని ఎవరూ మార్చలేరు. కాబట్టి ఇక తమకు తాము సర్దు చెప్పుకుంటూ మరో వరల్డ్ కప్ లో టైటిల్ కోసం ట్రై చేద్దాం అంటూ టీమిండియా కు మద్దతుగా నిలుస్తూ ఉన్నారుK9hli{#}Ahmedabad;Narendra Modi;VIRAT KOHLI;Cricket;World Cup;Indiaకోహ్లీ రికార్డ్.. అయినా ఏం లాభం అంటున్న ఫ్యాన్స్?కోహ్లీ రికార్డ్.. అయినా ఏం లాభం అంటున్న ఫ్యాన్స్?K9hli{#}Ahmedabad;Narendra Modi;VIRAT KOHLI;Cricket;World Cup;IndiaMon, 20 Nov 2023 10:45:00 GMTభారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ప్రస్తుతం ఒకే విషయం గురించి చర్చించుకుంటున్నారు. అదే ఇటీవల అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీం ఇండియా ఓటమి గురించి. ప్చ్.. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచి ఉంటే ఎంత బాగుండేదో అని ఎంతోమంది నిరాశలు మునిగిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. కానీ జరిగిందానిని ఎవరూ మార్చలేరు. కాబట్టి ఇక తమకు తాము సర్దు చెప్పుకుంటూ మరో వరల్డ్ కప్ లో టైటిల్ కోసం ట్రై చేద్దాం అంటూ టీమిండియా కు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. అయితే ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో వరస విజయాలు సాధిస్తూ అదరగొట్టిన టీమిండియా ఫైనల్ పోరులో మాత్రం అటు ఆస్ట్రేలియ ముందు నిలబడటంలో తడబడింది.


 ఈ క్రమంలోనే భారత బ్యాట్స్మెన్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ఇక టీమిండియా జట్టు విజయం కోసం ఎంతలా బౌలర్లు పోరాడినప్పటికీ ఓటమి తప్పలేదు అని చెప్పాలి. అయితే ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో అటు విరాట్ కోహ్లీ ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఏకంగా మూడు సెంచరీలు ఐదు హాఫ్ సెంచరీలతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక వరల్డ్ కప్ ఫైనల్ పోరు ముగిసే సరికి 765 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు


 ఒక ప్రపంచ కప్ ఎడిషన్ లో ఏకంగా 765 పరుగులు చేసిన తొలి బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ. ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్లో కూడా 54 పరుగులు చేసి హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్న.. మిగతా బ్యాట్స్మెన్ల నుంచి సరైన సహకారం లేకపోవడంతో టీమిండియా ఓటమిపాలు అయింది. అయితే ఇక మరోవైపు టి20 వరల్డ్ 2014లో 319 పరుగులు,  ఐపీఎల్ 2016లో 973 పరుగులతో ఒక ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది. అయితే కోహ్లీ ఎలాంటి రికార్డు సాధిస్తే ఏంటి.. టీమ్ ఇండియా కప్పు గెలవకుండా ఫైనల్లో ఓడిపోయినప్పుడు అని ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఈ రికార్డు పై కామెంట్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>