LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hair-shaininge763a7a9-e0a1-4f7d-a277-6e3b4b25bf75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/hair-shaininge763a7a9-e0a1-4f7d-a277-6e3b4b25bf75-415x250-IndiaHerald.jpgచాలామంది జుట్టు చలికాలంలో ఉండే చల్లగాలూలకు ఎండు గడ్డిలా తయారవ్వుతూ ఉంటుంది.మరియు మెరుపును కోల్పోవడం,చుండ్రు,జుట్టు ఎక్కువగా ఉడడం,చివర్లు చిట్లడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ సమస్యలు అన్నింటిని నివారించడానికి ఎన్ని రకాల షాంపూలు, ఆయిల్ వాడినా పెద్దగా ఫలితం ఉండదు.ఏ సీజన్ లోనైనా జుట్టు జీవత్వం పొంది,మెరిసేలా చేసేందుకు రోజ్మెరీ ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి.అంతేకాక ఈ ఆయిల్ ని వంటల్లో వాడటం వల్ల కూడా మలబద్ధకం,గ్యాస్ అజీర్తి వంటి పొట్ట సమస్యలని నివారిస్తుంది కూడా.అన్ని ప్రయోజనాలు కలిగిన రోజ్మెరHAIR;SHAINING{#}oil;Gas Stoveజుట్టును మెరిసేలా చెయ్యాలంటే రోజ్మెరీని ఇలా వాడి చుడండి..!జుట్టును మెరిసేలా చెయ్యాలంటే రోజ్మెరీని ఇలా వాడి చుడండి..!HAIR;SHAINING{#}oil;Gas StoveMon, 20 Nov 2023 19:00:00 GMTచాలామంది జుట్టు చలికాలంలో ఉండే చల్లగాలూలకు ఎండు గడ్డిలా తయారవ్వుతూ ఉంటుంది.మరియు మెరుపును కోల్పోవడం,చుండ్రు,జుట్టు ఎక్కువగా ఉడడం,చివర్లు చిట్లడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ సమస్యలు అన్నింటిని నివారించడానికి ఎన్ని రకాల షాంపూలు, ఆయిల్ వాడినా పెద్దగా ఫలితం ఉండదు.ఏ సీజన్ లోనైనా జుట్టు జీవత్వం పొంది,మెరిసేలా చేసేందుకు రోజ్మెరీ ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి.అంతేకాక ఈ ఆయిల్ ని వంటల్లో వాడటం వల్ల కూడా మలబద్ధకం,గ్యాస్ అజీర్తి వంటి పొట్ట సమస్యలని నివారిస్తుంది కూడా.అన్ని ప్రయోజనాలు కలిగిన రోజ్మెరీ ఆకులను ఏవిదంగా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండీ..

దీని కోసము ముందుగా గుప్పెడు రోజ్మెరీ ఆకులను తీసుకొని,కడిగి బాగా శుభ్రపరుచుకోవాలి.ఇప్పుడు స్టవ్ పై ఒక మందపాటి గిన్నె పెట్టి,అందులో 4 గ్లాసుల నీటిని వేసి మరగనివ్వాలి.ఇది కొంచెం మరిగిన తర్వాత రోజ్మెరీ ఆకులు,ఒక స్ఫూన్ మెంతులు వేసి,ఆ నీళ్లన్ని ఒక గ్లాస్ అయ్యేంత వరకు ఊడికించి,పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు స్ప్రే బాటిల్ తీసుకొని,ఆ నీటిని స్టోర్ చేసుకోవాలి.

ఈ నీటిని తలస్నానము చేసే గంట ముందు జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా స్ప్రే చేసి,అరిన తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.ఇలా జుట్టు నిర్జీవంగా వున్నప్పుడల్లా రోజ్మెరీ అప్లై చేయడంతో,జుట్టు తిరిగి జీవత్వం పొంది, జుట్టు మెరిస్తూ దృఢంగా తయారవుతుంది.అంతేకాక చుండ్రు,పేన్లు,జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తొలగిపోతాయి.

మరియు జుట్టు సమస్యలు మన ఆహారపు అలవాట్లు,జీవన శైలి,వంశపారంపర్యం,మెయింటెన్స్ మీద ఆధారపడి ఉంటుంది.కొంతమందిలో హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి. కావున ముందు హార్మోన్స్ ని సెట్ చేసుకోవడంతో కూడా జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.మరియు శరీరం డీహైడ్రెట్ కాకుండా రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోవడం ఉత్తమం.

కావున సరైనా ఆహారం తీసుకొని,సరైన జీవన విధానం అలవర్చుకోవడం,జుట్టును మురికిగా లేకుండా ఎప్పటికి అప్పుడు శుభ్రం చేసుకోవడంతో జుట్టు మెరుస్తూ ఉంటుంది.మీరూ కూడా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే రోజ్మెరీని తప్పక ఉపయోగించండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>