MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood278a69ad-02b9-4755-aae8-bf8a2a034146-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood278a69ad-02b9-4755-aae8-bf8a2a034146-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. గత ఏడాది 'అఖండ' తో భారీ హిట్ అందుకున్న బాలయ్య ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు విజయాలు అందుకున్నాడు. అందులో ఒకటి 'వీరసింహారెడ్డి' మరొకటి 'భగవంత్ కేసరి'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన 'వీర సింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన 'భగవంత్ కేసరి' భారీ కలెక్షన్స్ అందుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ దసరా కానుకగా tollywood{#}Ravi;Balakrishna;Salman Khan;ravi teja;sithara;Bobby;Chitram;Makar Sakranti;Yuva;Blockbuster hit;Telugu;naga;vegetable market;Hero;Chiranjeevi;trivikram srinivas;Cinema;Director;Success;Massబాలయ్య సినిమాలో అదే ఫార్ములా అప్లై చేస్తున్న బాబీ?బాలయ్య సినిమాలో అదే ఫార్ములా అప్లై చేస్తున్న బాబీ?tollywood{#}Ravi;Balakrishna;Salman Khan;ravi teja;sithara;Bobby;Chitram;Makar Sakranti;Yuva;Blockbuster hit;Telugu;naga;vegetable market;Hero;Chiranjeevi;trivikram srinivas;Cinema;Director;Success;MassSun, 19 Nov 2023 13:40:00 GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. గత ఏడాది 'అఖండ' తో భారీ హిట్ అందుకున్న బాలయ్య ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు విజయాలు అందుకున్నాడు. అందులో ఒకటి 'వీరసింహారెడ్డి' మరొకటి 'భగవంత్ కేసరి'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన 'వీర సింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన 'భగవంత్ కేసరి' భారీ కలెక్షన్స్ అందుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ దసరా కానుకగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఇలా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో బాలయ్య మెల్లమెల్లగా తన మార్కెట్ ను అమాంతం పెంచుకుంటూ వెళుతున్నాడు. 'భగవంత్ కేసరి' సక్సెస్ తర్వాత బాలయ్య - బాబీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కూడా యాక్షన్ మోడ్ లో ఉండబోతున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే పోస్టర్స్ ద్వారా చెప్పకనే చెప్పారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైన ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ బయటికి వచ్చింది. 

ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర కోసం మరో యువ హీరోని రంగంలోకి దింపుతున్నాడట డైరెక్టర్ బాబి. ఆయన హీరో మరెవరో కాదు 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ అని తెలుస్తోంది. డైరెక్టర్ బాబీ తన గత చిత్రం 'వాల్తేరు వీరయ్య' లో కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు. అందులో చిరంజీవి తో పాటు మాస్ మహారాజ రవితేజ ప్రత్యేక పాత్రలో నటించాడు. సినిమా విజయం సాధించడంలో రవితేజ పాత్ర కూడా కీలకమనే చెప్పాలి. ఇప్పుడు బాలయ్య సినిమా కోసం కూడా అదే ఫార్ములాను రిపీట్ చేయబోతున్నాడట బాబి. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>