Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec987ccaf-b378-41b1-a3b7-2873728bd90c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec987ccaf-b378-41b1-a3b7-2873728bd90c-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఒకరితో చేయించాలి అనుకున్న పాత్ర మరొకరు చేసి, ఆ పాత్రతోనే ఎంతో పేరుని సంపాదించుకుంటారు. అలాంటి ఒక అదృష్టం అందుకున్న నటుడే ‘సత్యం రాజేష్'.ఇండస్ట్రీకి విలన్ అవ్వాలని వచ్చిన రాజేష్ మూడేళ్ళ పాటు స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉన్నా ఒక్కరూ అవకాశం ఇచ్చిన వారు లేరు. ‘సార్ నేను విలన్ గా చేస్తాను’ అని రాజేష్ అవకాశం అడిగితే.. ‘నువ్వు విలన్‌గానా..?’ అంటూ కామెంట్స్ చేసేవారట. ఇక ఈ అవకాశాలు వేటలో సరైన తిండి లేక.. రాజేష్ బరువు తగ్గిపోయి సన్నబడి, ముఖం పీక్కుపోయి చిన్న పిల్లాడిలా కనిపించేవారు. ఆ పరిసsocialstars lifestyle{#}Comedy;producer;Producer;ali;Hero;Darsakudu;Director;Cinemaనాకు గుర్తింపు రావడానికి కారణం ఆ రోజు అలీ కి అలా జరగడమే...??నాకు గుర్తింపు రావడానికి కారణం ఆ రోజు అలీ కి అలా జరగడమే...??socialstars lifestyle{#}Comedy;producer;Producer;ali;Hero;Darsakudu;Director;CinemaSun, 19 Nov 2023 16:19:00 GMTసినీ ఇండస్ట్రీలో ఒకరితో చేయించాలి అనుకున్న పాత్ర మరొకరు చేసి, ఆ పాత్రతోనే ఎంతో పేరుని సంపాదించుకుంటారు. అలాంటి ఒక అదృష్టం అందుకున్న నటుడే ‘సత్యం రాజేష్'.ఇండస్ట్రీకి విలన్ అవ్వాలని వచ్చిన రాజేష్ మూడేళ్ళ పాటు స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉన్నా ఒక్కరూ అవకాశం ఇచ్చిన వారు లేరు. ‘సార్ నేను విలన్ గా చేస్తాను’ అని రాజేష్ అవకాశం అడిగితే.. ‘నువ్వు విలన్‌గానా..?’ అంటూ కామెంట్స్ చేసేవారట.

ఇక ఈ అవకాశాలు వేటలో సరైన తిండి లేక.. రాజేష్ బరువు తగ్గిపోయి సన్నబడి, ముఖం పీక్కుపోయి చిన్న పిల్లాడిలా కనిపించేవారు. ఆ పరిస్థితిలో కూడా తాను విలన్ గా చేస్తాను అని అడిగితే అందరూ నవ్వుకునేవారట. కానీ రాజేష్ మాత్రం నిరుత్సాహ పడలేదు. ఆడిషన్స్‌ ఇస్తూ అవకాశాలు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. 2002లో ‘జోరుగా హుషారుగా’ సినిమాలో ఒక చిన్న పాత్ర అందుకున్నారు. ఆ తరువాత హీరో ఫ్రెండ్ గా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చారు. 2003లో సుమంత్‌ హీరోగా 'సత్యం' మూవీ తెరకెక్కుతుంది. ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్ర కోసం అలీని అనుకున్నారు. ఆయన కూడా డేట్స్ ఇచ్చారు.

అయితే ఆ షూటింగ్ ముందు అలీ దుబాయ్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి అక్కడే రెండు రోజులు ఉండాల్సి వచ్చింది. ఇక్కడేమో షూటింగ్ షెడ్యూల్ ఆలస్యం అవుతుంది. దీంతో అలీ పాత్రలో రాజేష్ ని తీసుకోవాలని దర్శకుడు సూర్య కిరణ్‌ భావించారు. ఈ విషయాన్ని నిర్మాత నాగార్జునకి కూడా చెప్పారు. మొదటిలో నాగ్ ఒప్పుకోలేదు, అలీ వచ్చే వరకు వేచి చూద్దాం అని చెప్పారు. కానీ దర్శకుడు సూర్య కిరణ్‌, నాగార్జునతో.. నాకు రాజేష్ నటన పై, కామెడీ టైమింగ్ పై నమ్మకం ఉంది. నన్ను నమ్మి అతడికి అవకాశం ఇవ్వండి అని చెప్పారట. ఇక నాగ్ కూడా ఓకే అనడంతో.. రాజేష్‌బాబు కాస్తా 'సత్యం' రాజేష్‌ గా మారిపోయారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>