MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood514154a5-0303-404e-8bf3-8ab738bdd044-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood514154a5-0303-404e-8bf3-8ab738bdd044-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఒక్క ప్లాప్ కూడా లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత ప్రతి సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడిగా అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా బాలయ్యను 'భగవంత్ కేసరి' గా చూపించి మరో సక్సెస్ అందుకున్నాడు. దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది. 'భగవంత్ కేసరి'తో సక్సెస్ అందుకున్న ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ మూవీ గురించి ఏదైనా అప్డేట్ ఇస్తాడని అనుకుంటే ఉన్నట్టుండి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. అనిల్ tollywood{#}anil music;anil ravipudi;Dussehra;Parliment;MLA;Vijayadashami;Party;Telugu;Rajamouli;Tollywood;Cinema;Director;Success;media;Manamపొలిటికల్ గెటప్ లో అనిల్ రావిపూడి..రాజకీయాల్లోకి ఎంట్రీ..!!పొలిటికల్ గెటప్ లో అనిల్ రావిపూడి..రాజకీయాల్లోకి ఎంట్రీ..!!tollywood{#}anil music;anil ravipudi;Dussehra;Parliment;MLA;Vijayadashami;Party;Telugu;Rajamouli;Tollywood;Cinema;Director;Success;media;ManamSun, 19 Nov 2023 13:50:00 GMT టాలీవుడ్ లో ఒక్క ప్లాప్ కూడా లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత ప్రతి సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడిగా అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా బాలయ్యను 'భగవంత్ కేసరి' గా చూపించి మరో సక్సెస్ అందుకున్నాడు. దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది. 'భగవంత్ కేసరి'తో సక్సెస్ అందుకున్న ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ మూవీ గురించి ఏదైనా అప్డేట్ ఇస్తాడని అనుకుంటే ఉన్నట్టుండి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయనే ఓ వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అనిల్ రావిపూడి పొలిటికల్ లుక్ లో కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు." నేను డైరెక్ట్ చేశాను, మీరు హిట్ చేశారు. నేను ఎంటర్టైన్ చేశాను, మీరు ఎంటర్టైన్ అయ్యారు. గెలిచేది నేనైనా గెలిపించేది మీరే. కానీ ఈసారి నాకు గెలుపు థియేటర్లో కాదు. అసెంబ్లీ.. ఓ పార్లమెంట్ ఇలా ప్లాన్ చేసుకుంటున్నా. బాక్సాఫీస్ సక్సెస్ చూసిన నాకు బ్యాలెట్ బాక్స్ సక్సెస్ చూడాలని ఉంది. మనం పార్టీ పెట్టబోతున్నాం. మన పార్టీ పేరేంటో, మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరో మొత్తం ఇన్ఫర్మేషన్ తో త్వరలో వస్తా" అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఈ వీడియో అందులో అనిల్ రావిపూడి పొలిటికల్ గెటప్ సోషల్ మీడియాతో వైరల్ గా మారాయి. అసలు విషయం ఏంటంటే అనిల్ రావిపూడి నిజంగా పాలిటిక్స్ లోకి రావడం లేదు. ఇదంతా ఓ షో కోసం ప్లాన్ చేశారు. తెలుగు ఓటీటీ 'ఆహా' దీన్ని ప్లాన్ చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి నెలకొన్న నేపథ్యంలో పొలిటికల్ కాన్సెప్ట్ తో ఓ షో ప్లాన్ చేస్తున్నారని, దానికి అనిల్ రావిపూడి యాంకర్ గా వ్యవహరిస్తారని సమాచారం. అందులో భాగంగానే ఈ ప్రోమో ని రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. నిజంగానే ఇది షో కోసం చేస్తున్నారా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>