Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc742334ba-39cb-4880-b5f8-8e712a653f19-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc742334ba-39cb-4880-b5f8-8e712a653f19-415x250-IndiaHerald.jpgవరల్డ్ క్రికెట్ లో పటిష్టమైన టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతున్న భారత జట్టుతో మ్యాచ్ అంటే చాలు ప్రత్యర్థి టీమ్స్ అన్ని కూడా ప్రత్యేకమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అలాంటిది ఇక భారత జట్టుతో వారి సొంత గడ్డమీద మ్యాచ్ జరుగుతూ ఉంది అంటే.. ఇక దాదాపు గెలుస్తామని నమ్మకం కూడా ప్రత్యర్థులకు ఉండదు. ఎందుకంటే సొంత గడ్డపై టీమిండియాని ఓడించడం అంత సులువైన విషయం కాదు. ఇక ఈ విషయాన్ని ఇప్పుడు వరకు ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు, ప్రత్యర్థి జట్ల కెప్టెన్లు కూడా తెలిపారు. అయితే ఇది ముమ్మాటIcc{#}Dookudu;Audience;Narendra Modi;media;Ahmedabad;Australia;World Cup;Cricket;Indiaఇండియాతో ఫైనల్.. మా ప్లాన్ అదే.. వాళ్ల నోళ్లు మూయిస్తాం : కమిన్స్ఇండియాతో ఫైనల్.. మా ప్లాన్ అదే.. వాళ్ల నోళ్లు మూయిస్తాం : కమిన్స్Icc{#}Dookudu;Audience;Narendra Modi;media;Ahmedabad;Australia;World Cup;Cricket;IndiaSun, 19 Nov 2023 07:40:00 GMTవరల్డ్ క్రికెట్ లో పటిష్టమైన టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతున్న భారత జట్టుతో మ్యాచ్ అంటే చాలు ప్రత్యర్థి టీమ్స్ అన్ని కూడా ప్రత్యేకమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అలాంటిది ఇక భారత జట్టుతో వారి సొంత గడ్డమీద మ్యాచ్ జరుగుతూ ఉంది అంటే.. ఇక దాదాపు గెలుస్తామని నమ్మకం కూడా ప్రత్యర్థులకు ఉండదు. ఎందుకంటే సొంత గడ్డపై టీమిండియాని ఓడించడం అంత సులువైన విషయం కాదు. ఇక ఈ విషయాన్ని ఇప్పుడు వరకు ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు, ప్రత్యర్థి జట్ల కెప్టెన్లు కూడా తెలిపారు.


 అయితే ఇది ముమ్మాటికి నిజమే అన్న విషయాన్ని ఇక ఇప్పుడు భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో నిరూపించింది టీమిండియా. ఎందుకంటే లీగ్ దశ నుంచి దూకుడు చూపిస్తున్న టీమిండియా.. ప్రత్యర్థి టీమ్స్ అన్నింటి పై కూడా పైచేయి సాధించింది. ఏకంగా సెమీఫైనల్ వరకు పది మ్యాచ్లు ఆడిన భారత జట్టు.. అన్ని మ్యాచ్ లలో కూడా విజయం సాధించి సత్తా చాటింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు నేడు ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలబడబోతుంది భారత జట్టు.


 ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో కనిపిస్తున్న టీమ్ ఇండియాను.. ఫైనల్ లో ఇక సొంత గడ్డమీద ఓడించడం ఆస్ట్రేలియాకు పెద్ద సవాలతో కూడుకున్న పని. దీంతో ఎలాంటి ప్లానింగ్ తో ఆస్ట్రేలియా బరిలోకి దిగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియాతో ఫైనల్ మ్యాచ్ కి తమ ప్లాన్ ఏంటో చెప్పుకొచ్చాడు. స్టేడియంలో ప్రేక్షకులు ఏకపక్షంగా ఉంటారు. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తారు. అలాంటి ప్రేక్షకులను నిశ్శబ్దంగా మార్చడం కంటే గొప్ప సంతృప్తి ఆటగాళ్లకు మరొకటి ఉండదు. ఫైనల్ లో మా ప్లాన్ అదే అంటూ ప్యాడ్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మహాసంగ్రామానికి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>