MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodab530670-c3c7-4ca4-be85-9851fe005b0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodab530670-c3c7-4ca4-be85-9851fe005b0a-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన అట్లీ కుమార్ రీసెంట్ గా 'జవాన్' మూవీ తో నార్త్ లో సత్తా చాటిన విషయం తెలిసిందే. క్రమంలోనే అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. 'జవాన్' తర్వాత ఇప్పటివరకు అట్లీ తన నెక్స్ట్ మూవీ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అట్లీ చేసిన కామెంట్స్ అయితే ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. 'జవాన్' తర్వాత తన నెక్స్ట్ మూవీ ఏకంగా రూ.3000 కోట్లు వసూలు చేయబోతుందని tollywood{#}Rajani kanth;Dalapathi;Oscar;Kanna Lakshminarayana;shankar;Joseph Vijay;atlee kumar;Cinema;Director;netizensరజినీకాంత్ తో మూవీపై అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ..!!రజినీకాంత్ తో మూవీపై అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ..!!tollywood{#}Rajani kanth;Dalapathi;Oscar;Kanna Lakshminarayana;shankar;Joseph Vijay;atlee kumar;Cinema;Director;netizensSun, 19 Nov 2023 14:00:00 GMTకోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన అట్లీ కుమార్ రీసెంట్ గా 'జవాన్' మూవీ తో నార్త్ లో సత్తా చాటిన విషయం తెలిసిందే.  క్రమంలోనే అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. 'జవాన్' తర్వాత ఇప్పటివరకు అట్లీ తన నెక్స్ట్ మూవీ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అట్లీ చేసిన కామెంట్స్ అయితే ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. 'జవాన్' తర్వాత తన నెక్స్ట్ మూవీ ఏకంగా రూ.3000 కోట్లు వసూలు చేయబోతుందని వ్యాఖ్యానించారు ఈ దర్శకుడు. అంతేకాదు షారుక్ ఖాన్, దళపతి విజయ్ లతో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నానని, 

వారిద్దరితో సినిమా చేస్తే ఖచ్చితంగా రూ.3000 కోట్లు ఈజీగా క్రాస్ అవుతాయని అన్నాడు. దాంతో అట్లిపై సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోలింగ్ జరిగింది. అక్కడితో ఆగకుండా 'జవాన్' సినిమాను ఏకంగా ఆస్కార్ కి తీసుకెళ్తానని చెప్పడంతో ఒక్క సినిమా వెయ్యి కోట్లు సాధించినందుకు ఇంత ఓవరాక్షన్ అవసరమా? అంటూ నెటిజన్స్ అట్లీ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేయబోయే సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేయడంతో పాటు ఈ మూవీ పై క్లారిటీ ఇచ్చాడు." నేను రజనీకాంత్ కు వీరాభిమానిని. రజనీకాంత్ నన్ను ముద్దుగా కన్నా అని పిలుస్తారు. నాతో సినిమా చేయడానికి ఆయన ఎప్పుడూ రెడీ గానే ఉంటారు. 

తలైవా నటించిన దళపతి సినిమా చూసిన తర్వాతే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాను. రోబో సినిమాకి శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశా. రెండు మూడు కథలు కూడా చర్చించుకున్నాం. కానీ ఆయనకు సరిపోయే పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ కాలేదు. ఆయనతో చేయబోయే సినిమా భాషా మూవీని మించి ఉండాలి అని అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అట్లీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>