HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health3f1b3ab6-b588-4791-b843-89258eec3cf0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health3f1b3ab6-b588-4791-b843-89258eec3cf0-415x250-IndiaHerald.jpgమనలో చాలా మంది కూడా చాలా సన్నగా ఉంటారు.కొందరికి అయితే ఎముకలు కనిపిస్తూ ఉంటాయి.ఇలా సన్నగా ఉన్న వారు బరువు పెరగడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.చాలా మంది కూడా బరువు పెరగడానికి జంక్ ఫుడ్ ను తీసుకుంటూ ఉంటారు. కానీ జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు వేగంగా పెరుగుతుంది. కాబట్టి సన్నగా ఉండే వారు బరువు పెరగాలి కానీ కొవ్వు పెరగకుండా కండ పెరిగే ఆహారాలను తీసుకోవాలి. కండ పెరిగి బరువును పెంచే ఆహారాలను కూడా తీసుకోవాలి. చాలా మంది సన్నగా ఉన్న వారు కండ పెరగడానికి మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటHEALTH{#}Cholesterol;Eveningసన్నగా ఉన్నవారిని లావుగా మార్చే సింపుల్ డైట్?సన్నగా ఉన్నవారిని లావుగా మార్చే సింపుల్ డైట్?HEALTH{#}Cholesterol;EveningSun, 19 Nov 2023 22:52:00 GMTమనలో చాలా మంది కూడా చాలా సన్నగా ఉంటారు.కొందరికి అయితే ఎముకలు కనిపిస్తూ ఉంటాయి.ఇలా సన్నగా ఉన్న వారు బరువు పెరగడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.చాలా మంది కూడా బరువు పెరగడానికి జంక్ ఫుడ్ ను తీసుకుంటూ ఉంటారు. కానీ జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు వేగంగా పెరుగుతుంది. కాబట్టి సన్నగా ఉండే వారు బరువు పెరగాలి కానీ కొవ్వు పెరగకుండా కండ పెరిగే ఆహారాలను తీసుకోవాలి. కండ పెరిగి బరువును పెంచే ఆహారాలను కూడా తీసుకోవాలి. చాలా మంది సన్నగా ఉన్న వారు కండ పెరగడానికి మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది వీటిని తీసుకోలేరు. కేవలం మాంసం మాత్రమే కాకుండా ఇతర ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా చాలా సులభంగా బరువు పెరగవచ్చు.ఈ ఆహారాలను తినడం వల్ల తక్కువ ఖర్చులో తక్కువ పమయంలో సులభంగా బరువు పెరగవచ్చు. బరువు పెరగాలనుకునే వారిలో అరుగుదల ఇంకా ఆకలి రెండు కూడా ఎక్కువగా ఉండాలి.ఖచ్చితంగా మలబద్దకం సమస్య లేకుండా చూసుకోవాలి.


 బరువు పెరగాలనుకునే వారు ముందుగా ప్రతి రోజూ ఉదయాన్నే నీటిని తాగి సుఖ విరోచనం అయ్యేలా చూసుకోవాలి. ఆ తరువాత అల్పాహారంలో భాగంగా నానబెట్టిన పల్లీలను రెండు గుప్పెళ్ల మోతాదులో తీసుకోవాలి. తరువాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, మొలకెత్తిన గింజలు ఇంకా 10 ఖర్జూర పండ్లను తీసుకోవాలి. ఇంకా అలాగే సపోటా, జామ,అరటి వంటి పండ్లను తీసుకోవాలి.ఇలా అల్ఫాహారంలో భాగంగా తినడం వల్ల తగినంత ప్రోటీన్ లభిస్తుంది. ఇంకా అలాగే మధ్యాహ్నం వరకు నీటిని తాగుతూ ఉండాలి. మధ్యాహ్నం దాకా ఎటువంటి ఇతర ఆహారాలను తీసుకోకుండా ఉండాలి. ఆ తరువాత మధ్యాహ్నం ముడి బియ్యం అన్నం, జొన్న అన్నం ఇంకా కొర్రల అన్నం వంటి వాటిని తీసుకోవాలి. ఇంకా అలాగే మధ్యాహ్న భోజనంలో అన్నం 60 శాతం, 20 శాతం ఆకుకూర పప్పు అలాగే 20 శాతం కూరలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడప్పుడూ సోయా గింజలు లేదా మీల్ మేకర్ తో కూర చేసి తినాలి. ఇలా భోజనం చేసిన తరువాత మరలా సాయంత్రం 6 గంటల వరకు నీటిని తప్ప ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>