Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-840c0702-e146-4795-a405-8887c89dea0c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-840c0702-e146-4795-a405-8887c89dea0c-415x250-IndiaHerald.jpgవరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా కొనసాగుతూ ఉన్నాయి ఆస్ట్రేలియా, ఇండియా జట్లు. అయితే ఈ రెండు టీమ్స్ ని కూడా ఛాంపియన్ టీమ్స్ అని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు పిలుచుకుంటూ ఉంటారు. తమదైన రోజు ఇక ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ రెండు జట్లు ఘనవిజయాలను అందుకోగలవు. అయితే ఇక ఇప్పుడు ఈ రెండు పటిష్టమైన టీమ్స్ మధ్య ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇక ఈ మహాసంగ్రామం మరికొన్ని గంటల్లో మొదలు కాబోతుంది. అయితే మొదట్లో ఓటములతో తలబడిన ఆస్ట్రేలియా ఆ తర్వాతCricket {#}Champion;Yevaru;Australia;Ahmedabad;Narendra Modi;World Cup;Cricket;Indiaఫైనల్ మ్యాచ్ : ఇండియా vs ఆసిస్.. హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?ఫైనల్ మ్యాచ్ : ఇండియా vs ఆసిస్.. హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?Cricket {#}Champion;Yevaru;Australia;Ahmedabad;Narendra Modi;World Cup;Cricket;IndiaSun, 19 Nov 2023 11:00:00 GMTవరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా కొనసాగుతూ ఉన్నాయి ఆస్ట్రేలియా, ఇండియా జట్లు. అయితే ఈ రెండు టీమ్స్ ని కూడా ఛాంపియన్ టీమ్స్ అని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు పిలుచుకుంటూ ఉంటారు. తమదైన రోజు ఇక ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ రెండు జట్లు ఘనవిజయాలను అందుకోగలవు. అయితే ఇక ఇప్పుడు ఈ రెండు పటిష్టమైన టీమ్స్ మధ్య ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది.  అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇక ఈ మహాసంగ్రామం మరికొన్ని గంటల్లో మొదలు కాబోతుంది.


అయితే మొదట్లో ఓటములతో తలబడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని సెమీఫైనల్కు వచ్చి.. అక్కడ సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్ అడుగుపెట్టింది. అయితే మొదటి నుంచి ఒక్క ఓటమి కూడా చవిచూడని టీమిండియా.. ఇక ఈ వరల్డ్ కప్ లో ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ రెండు టీమ్స్ మధ్య పోటీ కావడంతో.. ఎవరు గెలుస్తారు అనేది ఒక అంచనాకు రాలేకపోతున్నారు క్రికెట్ ప్రేక్షకులు. అయితే ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో.. ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి కూడా క్రికెట్ ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు.


 ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇరుజట్లు ఇప్పటివరకు.. 13 మ్యాచ్ లలో తలబడ్డాయి  ఇక ఇందులో ఎనిమిది సార్లు ఆస్ట్రేలియా విజయం సాధిస్తే ఐదు మ్యాచ్ లలో భారత జట్టు గెలుపొందింది. అయితే చివరి మూడు మ్యాచ్ లలో రెండు సార్లు ఆస్ట్రేలియా పై భారత్ విజయం సాధించడం గమనార్హం. ఇక లీగ్ దశలో భారత్ ఆసిస్ ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఇక భారత్ విజయం సాధించిన మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసి గెలిచినవి రెండు అయితే.. చేజింగ్ చేస్తూ గెలిచినవి 3.  మొత్తంగా చూసుకుంటే వన్ డే ఫార్మాట్లో ఆస్ట్రేలియా, భారత్ జట్లు 150 సార్లు ముఖాముఖి తలబడితే.. 83 మ్యాచ్ లలో ఆస్ట్రేలియా 57 మ్యాచ్లలో  ఇండియా గెలిచింది. 10 మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. ఈ మధ్యకాలంలో మాత్రం అన్ని ద్వైపాక్షిక సిరీస్లలో భారత్ ఆస్ట్రేలియాపై పైచేయి సాధిస్తూ వస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>