EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan26084fb3-69ba-40f4-9430-54fcfa6dcf2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan26084fb3-69ba-40f4-9430-54fcfa6dcf2f-415x250-IndiaHerald.jpgదేశంలో ఇప్పుడు కులగణన పైనే పెద్ద చర్చ నడుస్తోంది. దీనికి మొదట నాంది పలికింది బిహార్. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ప్రభుత్వం కుల గణనను తొలిసారి చేపట్టి దేశంలో సామాజిక రాజకీయ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ కూడా దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు కొన్ని రాష్ట్రాలు స్వచ్ఛదంగా కుల గణన కార్యక్రమాలు చేపట్టాయి. అందులో ఒడిశా, పంజాబ్ లు ఉన్నాయి. తాజాగా ఏపీలో కూడా కుల గణన ప్రారంభమైంది. పేదలు అట్టడుగు వర్గాల ప్రజలను ఉన్నత స్థాయికి తీjagan{#}vidya;Jagan;ATCHANNAIDU KINJARAPU;Andhra Pradesh;Rahul Gandhi;Nitish Kumar;Backward Classes;Government;Survey;TDP;YCP;Punjab;Population;India;Novemberజగన్‌ బీసీ వ్యూహానికి టీడీపీ క్లీన్‌ బౌల్డ్‌?జగన్‌ బీసీ వ్యూహానికి టీడీపీ క్లీన్‌ బౌల్డ్‌?jagan{#}vidya;Jagan;ATCHANNAIDU KINJARAPU;Andhra Pradesh;Rahul Gandhi;Nitish Kumar;Backward Classes;Government;Survey;TDP;YCP;Punjab;Population;India;NovemberSun, 19 Nov 2023 09:00:00 GMTదేశంలో ఇప్పుడు కులగణన పైనే పెద్ద చర్చ నడుస్తోంది. దీనికి మొదట నాంది పలికింది బిహార్. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ప్రభుత్వం కుల గణనను తొలిసారి చేపట్టి దేశంలో సామాజిక రాజకీయ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ కూడా దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.  మరోవైపు కొన్ని రాష్ట్రాలు స్వచ్ఛదంగా కుల గణన కార్యక్రమాలు చేపట్టాయి. అందులో ఒడిశా, పంజాబ్ లు ఉన్నాయి.


తాజాగా ఏపీలో కూడా కుల గణన ప్రారంభమైంది. పేదలు అట్టడుగు వర్గాల  ప్రజలను ఉన్నత స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో సమగ్ర కుల గణనకు జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది. 92 ఏళ్ల తర్వాత చేపడుతున్న కులగణనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కులాల లెక్కలు తేలుస్తామంటోంది. ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకునేందుకు కులగణన చేపట్టాలని నిర్ణయించింది.


దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేసిన ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఐదు ప్రాంతాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ షురూ చేసింది. నవంబరు 27 నుంచి పూర్తిస్థాయిలో సర్వే చేపట్టనుంది. సర్వే మొత్తం గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా జరగనుంది. మొత్తంగా ఏపీ ప్రభుత్వం సాహసోపేతంగా చేపట్టిన కులగణన ప్రక్రియపై వివిధ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. విద్య ఉద్యోగం, రాజకీయాల్లో రిజర్వేషన్లు జనాభా దమాషా ప్రకారం అమలు చేయడానికి దోహద పడుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.


మరోవైపు టీడీపీ మాత్రం బీసీ దీనిపై భిన్న వైఖరి ప్రదర్శిస్తోంది.  అచ్చెన్నాయుడు దీనిపై చేసిన వ్యాఖ్యలు చూస్తే టీడీపీ కులగణనకు వ్యతిరేకమా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కులగణను వ్యతిరేకిస్తున్నారా.. లేక జగన్ ధైర్యంగా ముందుకు వచ్చి చేయడాన్ని సహించలేకపోతున్నారా అనేది అర్థం కావడం లేదు. మరోవైపు బీసీల పక్షపాతిగా చెప్పుకునే టీడీపీ దాదాపు 20 ఏళ్లు అధికారంలో ఉన్న ఎందుకు కులగణన చేపట్టలేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>