PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-lokesh-chandrababu-0a1c2f57-cec5-4c5a-a4bb-c8e0ae818751-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-lokesh-chandrababu-0a1c2f57-cec5-4c5a-a4bb-c8e0ae818751-415x250-IndiaHerald.jpgఅలాగే నిజం గెలవాలని భువనేశ్వరి మొదలుపెట్టిన బస్సుయాత్ర కూడా నిలిచిపోయింది. చంద్రబాబు జైలులో ఉన్నపుడు బస్సుయాత్ర మొదలుపెట్టిన భువనేశ్వరి మహాయితే ఒక వారంరోజులు తిరుగుంటారంతే. చంద్రబాబుకు ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో వెంటనే బస్సుయాత్రను ఆపేశారు. మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు బయటకు రాగానే నిజం గెలిచిందని భువనేశ్వరి అనుకునుంటారు. అందుకనే తర్వాత మళ్ళీ బస్సుయాత్ర గురించి, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ఆర్ధికసాయం చేయటం గురించి ఆమె ఆలోచించటంలేదు. tdp lokesh chandrababu {#}bhuvaneshwari;Nara Bhuvaneshwari;Nijam;Lokesh;Lokesh Kanagaraj;CBN;TDP;courtఅమరావతి : టీడీపీ రివర్సులో నడుస్తోందా ?అమరావతి : టీడీపీ రివర్సులో నడుస్తోందా ?tdp lokesh chandrababu {#}bhuvaneshwari;Nara Bhuvaneshwari;Nijam;Lokesh;Lokesh Kanagaraj;CBN;TDP;courtSun, 19 Nov 2023 09:00:00 GMT


తెలుగుదేశంపార్టీ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటోంది. స్కిల్ స్కామ్ లో అరెస్టయి చంద్రబాబు రిమాండులో ఉన్నపుడు పార్టీలో ఏదో ఒక యాక్టివిటీ ఉండేది. అలాంటిది మధ్యంతర బెయిల్ పై విడుదలైన తర్వాత అంతా స్తబ్దుగా మారిపోయింది. పార్టీలో కింద నుండి పై స్ధాయి వరకు ఎవరూ ఏ యాక్టివిటీ చేయటంలేదు. లోకేష్ యువగళం పాదయాత్ర ఎప్పుడో ఆగిపోయింది. ఇక దాన్ని పునఃప్రారంభించే ఉద్దేశ్యంలో లోకేష్ లేరు.





అలాగే నిజం గెలవాలని భువనేశ్వరి మొదలుపెట్టిన బస్సుయాత్ర కూడా నిలిచిపోయింది. చంద్రబాబు జైలులో ఉన్నపుడు బస్సుయాత్ర మొదలుపెట్టిన భువనేశ్వరి మహాయితే ఒక వారంరోజులు తిరుగుంటారంతే. చంద్రబాబుకు ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో వెంటనే బస్సుయాత్రను ఆపేశారు. మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు బయటకు రాగానే నిజం గెలిచిందని భువనేశ్వరి అనుకునుంటారు. అందుకనే తర్వాత మళ్ళీ బస్సుయాత్ర గురించి, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ఆర్ధికసాయం చేయటం గురించి ఆమె ఆలోచించటంలేదు.





అక్కడక్కడ కొందరు టీడీపీ మద్దతుదారులు చంద్రబాబుకు మద్దతుగా పరిమితస్ధాయిలోనే ర్యాలీలని, సభలని హడావుడి చేసేవారు. ఇఫుడా హడావుడి కూడా జరగటంలేదు. ఏ విధంగా చూసినా పార్టీలో ఇపుడు స్తబ్దత ఆవరించింది. టీడీపీ+జనసేన నేతల సమన్వయ సమావేశాల పేరుతో హడావుడి చేద్దామని అనుకున్నారు. సమావేశాలు జరుగుతున్నాయి కానీ కొన్ని నియోజకవర్గాల్లో బాగా గొడవలవుతున్నాయి. గొడవులు జరుగుతున్న నియోజకవర్గాలే బాగా హైలైట్ అవుతున్నాయి. కోర్టు కండీషన్లలో  చంద్రబాబు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్నది కీలకమైనది.





బహిరంగంగా పాల్గొంటే కోర్టు దృష్టిలో పడతామన్న భయంతో చంద్రబాబు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటంలేదు. పైగా కంటికి ఆపరేషన్ చేసుకోవటం, ఒంట్లో అనేక రోగాలున్నాయని డాక్టర్లిచ్చిన సర్టిఫికేట్ ను లాయర్లు కోర్టులో సబ్మిట్ చేయటంతో అందరు నేతలను కూడా చంద్రబాబు కలవటంలేదు. కారణాలు తెలీదు కానీ లోకేష్ కూడా ఎక్కడా కనబడటంలేదు. క్షేత్రస్ధాయిలో రెండుపార్టీల నేతల సమావేశాలు తప్ప టీడీపీ తరపున మరే యాక్టివిటి జరగటంలేదు. రోడ్ల పరిస్ధితిపై ఉమ్మడి భేరి అనే కార్యక్రమం ఈరోజు నుండి మొదలవుతోంది.  మరీ కార్యక్రమం ఎలా జరుగుతుందో చూడాల్సిందే.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>