MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya--ranbeer-kapoor--rashmika-mandanna47626a4c-7831-47d8-86b1-afd2eed8ebc6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya--ranbeer-kapoor--rashmika-mandanna47626a4c-7831-47d8-86b1-afd2eed8ebc6-415x250-IndiaHerald.jpgబాలయ్య ప్రస్తుతం దూకుడు మీద ఉన్నారు.ఈ మధ్యనే 'భగవంత్ కేసరి' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా 135 కోట్ల భారీ వసూళ్ళని సాధించి బాలయ్య సత్తా ఏంటో నిరూపించింది.అంతేగాక ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అనిల్ రావి పూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు.ఇక ఈ సినిమా తమిళ్ లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది.అయితే రామ్ స్కంద లాగే ఈ సినిమా డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల కానుంది.ఇక తరువాత సినిమాని 'వాల్తేరు వీరయ్య' దర్శకుడు బాBalayya - Ranbeer Kapoor - Rashmika Mandanna{#}srinivas;suryadevara nagavamsi;Dookudu;anil music;Dussehra;Vijayadashami;Raccha;Blockbuster hit;Episode;sandeep;rashmika mandanna;Balakrishna;ram pothineni;Joseph Vijay;December;Darsakudu;Director;Cinema;Indiaషాకిస్తున్న యానిమల్ రన్ టైం.. రచ్చ చేసిన బాలయ్య?షాకిస్తున్న యానిమల్ రన్ టైం.. రచ్చ చేసిన బాలయ్య?Balayya - Ranbeer Kapoor - Rashmika Mandanna{#}srinivas;suryadevara nagavamsi;Dookudu;anil music;Dussehra;Vijayadashami;Raccha;Blockbuster hit;Episode;sandeep;rashmika mandanna;Balakrishna;ram pothineni;Joseph Vijay;December;Darsakudu;Director;Cinema;IndiaSun, 19 Nov 2023 17:56:00 GMTబాలయ్య ప్రస్తుతం దూకుడు మీద ఉన్నారు.ఈ మధ్యనే 'భగవంత్ కేసరి' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా 135 కోట్ల భారీ వసూళ్ళని సాధించి బాలయ్య సత్తా ఏంటో నిరూపించింది.అంతేగాక ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అనిల్ రావి పూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు.ఇక ఈ సినిమా తమిళ్ లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది.అయితే రామ్ స్కంద లాగే ఈ సినిమా డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల కానుంది.ఇక తరువాత సినిమాని 'వాల్తేరు వీరయ్య' దర్శకుడు బాబీతో చేయబోతున్నారు బాలయ్య.జూన్ 10 వ తేదీన అంటే బాలయ్య పుట్టినరోజు నాడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో చాలా లాంఛనంగా ప్రారంభమైంది. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత బ్యానర్ అయిన ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌’ కూడా ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.


బాలయ్య ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రియాలిటీ షోలు కూడా చేస్తున్నారు. అన్ స్టోపబుల్ విత్ ఎన్బీకేతో TRP రేటింగ్స్ కూడా బద్దలు కొడుతున్నారు.ఇక సరికొత్త రికార్డులని సృష్టించిన అన్‌స్టాపబుల్ విత్ NBK ఇటీవల సీజన్ 3 కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దసరా పండుగ కానుకగా అన్‌స్టాపబుల్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు.రెండో ఎపిసోడ్ లో యానిమల్ సినిమా టీం నుంచి సందీప్ వంగ, రణబీర్ కపూర్, రష్మిక మందన్నా వచ్చి తెగ సందడి చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని కూడా విడుదల చేశారు. ఈ ప్రోమోలో బాలయ్య యానిమల్ టీంతో కలిసి చాలా రచ్చ చేశారు. రణబీర్, రష్మిక లతో కలిసి బాగా డ్యాన్సులు వేశారు. ఇంకా సరదా ప్రశ్నలు అడిగారు. అలాగే రష్మికతో విజయ్ కి కాల్ చేయించారు. ప్రోమో అంతా కూడా ఫుల్ ఫన్ గా సరదాగా సాగిపోయింది.ఇక ప్రోమోలోనే ఈ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఎపిసోడ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ నవంబర్ 24 వ తేదీన న ఆహాలో ప్రీమియర్ అవ్వనుంది. ఇక యానిమల్ సినిమా నుంచి ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ డిసెంబర్ 1 వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రన్నింగ్ టైం ఏకంగా 180 నిముషాలు పైగా వుండనుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>