DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawand4578d2f-df67-45b9-95ac-b1714bcb7695-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawand4578d2f-df67-45b9-95ac-b1714bcb7695-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహం కాదు వైఖరి ఏంటో కూడా అటు జనసైనికులకు, ఇటు ప్రజలకు అంతు చిక్కడం లేదు. ఆ పార్టీ తెలంగాణ, ఆంధ్రాలో బీజేపీతో పొత్తులో ఉంది. అదే సందర్భంలో టీడీపీతో పొత్తు ఆంధ్రాలో ఉంది. తెలంగాణలో లేదు. కొంచెం గందరగోళంగా ఉంది కదూ.. ఈ పొత్తుల వ్యవహారంలో స్పష్టమైన అవగాహన పవన్ కల్యాణ్ కు మాత్రమే ఉంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన ఉంది. పోటీకి దూరంగా ఉంటున్నట్లు టీడీపీ తెలిపింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏపీలో జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా అనేక సమావేశాలు జరిగాయి. కానీ ఏ మీటింగ్ లpawan{#}revanth;Turmeric;TDP;Amit Shah;rahul;Rahul Sipligunj;Congress;Party;Janasena;Pawan Kalyan;Bharatiya Janata Party;Telanganaపవన్.. ఇంకెప్పుడు రంగంలోకి దిగుతాడో?పవన్.. ఇంకెప్పుడు రంగంలోకి దిగుతాడో?pawan{#}revanth;Turmeric;TDP;Amit Shah;rahul;Rahul Sipligunj;Congress;Party;Janasena;Pawan Kalyan;Bharatiya Janata Party;TelanganaSat, 18 Nov 2023 09:14:00 GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహం కాదు వైఖరి ఏంటో కూడా అటు జనసైనికులకు, ఇటు ప్రజలకు అంతు చిక్కడం లేదు. ఆ పార్టీ తెలంగాణ, ఆంధ్రాలో బీజేపీతో పొత్తులో ఉంది. అదే సందర్భంలో టీడీపీతో పొత్తు ఆంధ్రాలో ఉంది. తెలంగాణలో లేదు. కొంచెం గందరగోళంగా ఉంది కదూ.. ఈ పొత్తుల వ్యవహారంలో స్పష్టమైన అవగాహన పవన్ కల్యాణ్ కు మాత్రమే ఉంది.


ఎందుకంటే తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన ఉంది. పోటీకి దూరంగా ఉంటున్నట్లు టీడీపీ తెలిపింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏపీలో జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా అనేక సమావేశాలు జరిగాయి. కానీ ఏ మీటింగ్ లో కూడా తెలంగాణలో జనసేనకు మద్దతు ఇస్తున్నట్లు.. జనసేన అభ్యర్థులకు ఓటేయమని టీడీపీ కోరడం లేదు. అదే సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ సభలకు, సమావేశాలకు మాత్రం  పసుపు జెండాలు ధరించి మరీ హాజరవుతున్నారు.


మరోవైపు బీజేపీకి శత్రువుగా ఉన్న టీడీపీ ఈ పరిణామాలతో బద్ధ శత్రువుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.  అసలు బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుందే టీడీపీ సానుభూతి ఓటర్లతో పాటు, ఆంధ్రా సెటిలర్ల ఓట్ల కోసం. కానీ పవన్ మాత్రం తెలంగాణలో ఇంకా ప్రచారమే ప్రారంభించలేదు.
ఇప్పటికే అన్నీ పార్టీల అగ్రనేతలైన మోదీ, అమిత్ షా, కిషన్ రెడ్డి, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ప్రచారం మొదలు పెట్టారు.  


పోటీలో ఉండి ప్రచారం ప్రారంభించని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణే ఒక్కరే.  రోజుకి ఒక్కో నియోజకవర్గంలో తిరిగినా ఆ పార్టీకి ఎనలేని ఉత్సాహం వస్తోంది.  తమపై గౌరవం ఉంచి ఎనిమిది సీట్లను కేటాయించిన బీజేపీ ని మోసం చేసి టీడీపీ కోసం అంత త్యాగం ఎందుకు చేయాలి.  ఒకవేళ ఈ ఎన్నికల్లో జనసేన వల్ల తమకు లాభం లేదని బీజేపీ భావిస్తే ఏపీలో కచ్ఛితంగా దూరం పెడుతుంది. ఈ లాజిక్ పవన్ ఎందుకు మిస్ అవుతున్నారు. వ్యూహం తప్పిందా. పవన్ ఆత్మ విమర్శ చేసేకొని ప్రచార పర్వంలోకి దిగాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>