Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc89cd211d-208f-477b-8f6b-2d89a74499ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc89cd211d-208f-477b-8f6b-2d89a74499ad-415x250-IndiaHerald.jpgఇండియా వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన వరల్డ్ కప్ ట్రోఫీ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. పది టీమ్స్ తో ప్రారంభమైన వరల్డ్ కప్ ట్రోఫీలో ఇప్పుడు రెండు టీమ్స్ ఫైనల్ వరకు చేరుకున్నాయి. సెమీఫైనల్ లో విజయం సాధించిన ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్లో తలబడబోతున్నాయి అని చెప్పాలి. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతుంది. ఇక ఈ స్టేడియంలో 1,32,000 మంది సీటింగ్ కెపాసిటీ ఉండడంతో భారీ అభిమానుల మధ్య టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పIcc{#}Australia;Ahmedabad;Narendra Modi;November;World Cup;VIRAT KOHLI;Yevaruఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు.. మీ ఓటు ఎవరికి?ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు.. మీ ఓటు ఎవరికి?Icc{#}Australia;Ahmedabad;Narendra Modi;November;World Cup;VIRAT KOHLI;YevaruSat, 18 Nov 2023 10:30:00 GMTఇండియా వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన వరల్డ్ కప్ ట్రోఫీ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. పది టీమ్స్ తో ప్రారంభమైన వరల్డ్ కప్ ట్రోఫీలో ఇప్పుడు రెండు టీమ్స్ ఫైనల్ వరకు చేరుకున్నాయి. సెమీఫైనల్ లో విజయం సాధించిన ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్లో తలబడబోతున్నాయి అని చెప్పాలి. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతుంది. ఇక ఈ స్టేడియంలో 1,32,000 మంది  సీటింగ్ కెపాసిటీ ఉండడంతో భారీ అభిమానుల మధ్య టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి.



 అయితే 2003 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్ లో భారత జట్టును ఓడించింది. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు  ఫైనల్ మ్యాచ్లో ఈ రెండు టీమ్స్ మరోసారి తలబడుతూ ఉండడంతో.. తప్పకుండా భారత జట్టు ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంటుంది అని అభిమానులు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫైనల్ కు రెండు టీమ్స్ చేరుకున్నాయి. కొన్ని టీమ్స్ సెమీఫైనల్ లో టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తే.. మరికొన్ని టీమ్స్ లీగ్ దశ నుంచే ఇంటి బాట పట్టాయి. అయితే ఆయా జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ..ఇక ఆ టీమ్స్ లో ఉన్న కొంతమంది ఆటగాళ్లు చేసిన ప్రదర్శన మాత్రం వరల్డ్ కప్ లో ఇంకా చర్చకు వస్తూనే ఉంది.


 అయితే ప్రస్తుతం ప్రపంచ కప్ టోర్నీ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో.. ఈ ఎడిషన్ లో ఎవరు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఈ అవార్డు రేస్ లో 9 మంది ఉన్నారు అని ఐసిసి తెలిపింది. విరాట్ కోహ్లీ, ఆడం జంపా, డికాక్, షమీ, రచిన్ రవీంద్ర, మ్యాక్స్వెల్, రోహిత్ శర్మ, బుమ్రా, డారిల్ మిచెల్ పేర్లను ఐసిసి ప్రకటించింది. మరి ఫైనల్ మ్యాచ్ పూర్తయిన  తర్వాత ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎవరు నిలిచారు అనే విషయాన్ని ప్రకటిస్తుంది. తమ సైట్ లోకి వెళ్లి ఇక మీ ఫేవరెట్ ఆటగాడికి ఓటు వేయొచ్చు అంటూ పేర్కొంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>