Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/katrinab4294ebb-38a2-4f47-ad91-970a4dcc725c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/katrinab4294ebb-38a2-4f47-ad91-970a4dcc725c-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ జంటగా నటించిన సినిమా మెర్రి క్రిస్మస్. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ సహా అన్ని పనులను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ మూవీని డిసెంబర్ 8వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో ఎన్నో సినిమాల నుంచి పోటీ ఉన్న నేపథ్యంలో.. చివరికి ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పాలి. దీంతో ఇక మేరీ క్రిస్మస్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు అని అభిమానులు కూKatrina{#}Sriram Raghavan;vijay sethupathi;Christmas;Makar Sakranti;vegetable market;Malliswari;Venkatesh;Kollywood;Katrina Kaif;bollywood;Cinema;Telugu;Blockbuster hit;Hero;Heroine;Tamil;December;Januaryసంక్రాంతి బరిలో.. మరో స్టార్ హీరో మూవీ.. పోటీ మామూలుగా లేదుగా?సంక్రాంతి బరిలో.. మరో స్టార్ హీరో మూవీ.. పోటీ మామూలుగా లేదుగా?Katrina{#}Sriram Raghavan;vijay sethupathi;Christmas;Makar Sakranti;vegetable market;Malliswari;Venkatesh;Kollywood;Katrina Kaif;bollywood;Cinema;Telugu;Blockbuster hit;Hero;Heroine;Tamil;December;JanuarySat, 18 Nov 2023 11:29:00 GMTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్  జంటగా నటించిన సినిమా మెర్రి క్రిస్మస్. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ సహా అన్ని పనులను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ మూవీని డిసెంబర్ 8వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో ఎన్నో సినిమాల నుంచి పోటీ ఉన్న నేపథ్యంలో.. చివరికి ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పాలి. దీంతో ఇక మేరీ క్రిస్మస్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు అని అభిమానులు కూడా ఎదురు చూసారు.


 అయితే ఏకంగా మేరి క్రిస్మస్ సినిమా సంక్రాంతి బరిలో దిగబోతుంది అన్నది తెలుస్తుంది. జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. అయితే భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ సంక్రాంతి బరిలో చేరడంతో ఇక పోటీ మరింత పెరిగిపోయింది. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ లో సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు చాలానే బరిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు విజయ్ సేతుపతి లాంటి మరో స్టార్ హీరో సంక్రాంతి బరిలో నిలవడంతో పోటీ మరింత తీవ్రమైంది. ఇక ఇటీవల విడుదల తేదీన ప్రకటిస్తూ ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం. కాగా ఈ సినిమాకి అందాదున్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. అందుకే ఈ సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది.


 హిందీ, తమిళం తో పాటు తెలుగు భాషలో కూడా ఈ సినిమాను ఏక సమయంలో రిలీజ్ చేయబోతున్నారు. స్పై త్రిల్లర్  కథాంశం తో ఈ సినిమా తెరకెక్కింది  ఈ క్రమంలోనే ఈ మూవీ ద్వారా మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని విజయ్ సేతుపతి కూడా భావిస్తూ ఉన్నాడు. అయితే అతనికి తెలుగు తమిళంలో మాత్రమే కాదు హిందీలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఫర్జీ లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ లో నటించడం ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక ఇప్పటికే కత్రినా కైఫ్ హిట్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. మేరీ క్రిస్మస్ సినిమాతో సౌత్ లో కూడా తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలని చూస్తుంది. అయితే గతంలో విక్టరీ వెంకటేష్ నటించిన మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది కత్రినా కైఫ్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>