PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababued0c0e87-6e2f-4bea-b91f-fd45d214e308-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababued0c0e87-6e2f-4bea-b91f-fd45d214e308-415x250-IndiaHerald.jpgఎస్సీల్లో ఎవరైనా పెట్టాలని అనుకుంటారా అని ఎస్సీలను అవమానించి, తోకలు కత్తిరిస్తానని చెప్పి బీసీలను అవమానించిన చంద్రబాబు కేవలం సొంత సామాజికవర్గంలోని కొందరి కోసమే పాలన చేసినట్లు మండిపడ్డారు. ఎన్నికల ముందు తాను ప్రకటించిన మ్యానిఫెస్టో మీద కూడా నమ్మకం, గౌరవం లేదని చంద్రబాబును ఎత్తిపొడిచారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కారణంగా తోడెళ్ళని ఏకమవుతున్నాయన్న విషయాన్ని జనాలందరు గ్రహించాలని కోరారు. jagan chandrababu{#}yajamanya;Hanu Raghavapudi;Elections;NTR;Jagan;TDP;CBN;Reddy;Government;Telangana Chief Minister;CMఅమరావతి : చంద్రబాబు గుట్ట బయపెట్టారా ?అమరావతి : చంద్రబాబు గుట్ట బయపెట్టారా ?jagan chandrababu{#}yajamanya;Hanu Raghavapudi;Elections;NTR;Jagan;TDP;CBN;Reddy;Government;Telangana Chief Minister;CMSat, 18 Nov 2023 03:00:00 GMT

నూజివీడులో జరిగిన బహిరంగసభలో చంద్రబాబునాయుడు గుట్టును జగన్మోహన్ రెడ్డి బయటపెట్టారా ? అవుననే అనుకోవాల్సొస్తోంది. విషయం ఏమిటంటే జగన్ మాట్లాడుతు చంద్రబాబు అన్నీ వర్గాలను మోసం చేసినట్లు మండిపడ్డారు. అధికారంలోకి ఎప్పుడు వచ్చినా చంద్రబాబు దోపిడికి పాల్పడుతునే ఉన్నారని చెప్పారు. ప్రజలందరికీ మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి రాలేదన్నారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యింది ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచే అన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు.





అలాగే రెండోసారి సీఎం అయ్యింది వాజ్ పేయి, కార్గిల్ యుద్ధంలో గెలుపు కారణంగా మాత్రమే అని అందరికీ తెలుసన్నారు. యుద్ధంలో గెలుపు, వాజ్ పేయ్ కి ఉన్న మంచి పేరును చంద్రబాబు వాడుకుని ఎన్నికల్లో గెలిచారని సెటైర్లు వేశారు. ఇక మూడోసారి మళ్ళీ బీజేపీతో పొత్తు, నరేంద్రమోడి, రైతురుణమాఫీ లాంటి అనేక హామీలిచ్చారు కాబట్టే గెలిచినట్లు ఎద్దేవాచేశారు. అంటే గెలిచిన ప్రతిసారి ఎవరో ఒకరి కారణంగా మాత్రమే గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. ఎవరి మద్దతులేకుండా పోటీచేసిన 2019 ఎన్నికల్లో టీడీపీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో అందరికీ తెలుసన్నారు.





ఎస్సీల్లో ఎవరైనా పెట్టాలని అనుకుంటారా అని ఎస్సీలను అవమానించి, తోకలు కత్తిరిస్తానని చెప్పి బీసీలను అవమానించిన చంద్రబాబు కేవలం సొంత సామాజికవర్గంలోని కొందరి కోసమే పాలన చేసినట్లు మండిపడ్డారు. ఎన్నికల ముందు తాను ప్రకటించిన మ్యానిఫెస్టో మీద కూడా నమ్మకం, గౌరవం లేదని చంద్రబాబును ఎత్తిపొడిచారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కారణంగా తోడెళ్ళని ఏకమవుతున్నాయన్న విషయాన్ని జనాలందరు గ్రహించాలని కోరారు.





రాష్ట్రవ్యాప్తంగా సుమారు 46 లక్షల ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42 వేలమందికి జగన్ డీకేటీ పట్టాలను పంపిణీచేశారు. అలాగే అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించటం, అంకభూములకు కూడా పట్టాలను అందించారు. దశాబ్దాలుగా వివాదాల్లో ఉన్నభూ సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించినట్లు చెప్పారు. రైతులకు, పేదలకు నిజమైన సంక్షేమాన్ని అందించింది తమ ప్రభుత్వమే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. కాబట్టి తమ ప్రభుత్వంలో మంచి జరిగిందని అనుకుంటేనే తమకు ఓట్లేసి గెలిపించాలని జగన్ కోరారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>