EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ktr91edd0b0-049b-4141-9f75-09a75e847221-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ktr91edd0b0-049b-4141-9f75-09a75e847221-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్నెళ్లకు ఒక ముఖ్యమంత్రి మారతారంటూ.. దిల్లీకి గులాంగిరీ చేయాల్సి ఉంటుందని బీఆర్ఎస్ నేతలు తరచుగా ఆరోపిస్తున్న అంశం. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎంగా కేసీఆర్ పూర్తి కాలం పదవిలో ఉంటారా .. లేక కేటీఆర్ కు బాధ్యతలు అప్పజెప్పి దిల్లీ రాజకీయాలపై దృష్టి సారిస్తారా అని ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. గతంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తదుపరి ముఖ్యమంత్రి కేటీఆర్ అనktr{#}KTR;Telangana Chief Minister;KCR;CM;Congress;media;Prime Ministerఎన్నో ఇంటర్వ్యూలు: ఆ ప్రశ్నకు కేటీఆర్‌ నో ఆన్సర్‌?ఎన్నో ఇంటర్వ్యూలు: ఆ ప్రశ్నకు కేటీఆర్‌ నో ఆన్సర్‌?ktr{#}KTR;Telangana Chief Minister;KCR;CM;Congress;media;Prime MinisterSat, 18 Nov 2023 10:00:00 GMTకాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్నెళ్లకు ఒక ముఖ్యమంత్రి మారతారంటూ.. దిల్లీకి గులాంగిరీ చేయాల్సి ఉంటుందని బీఆర్ఎస్ నేతలు తరచుగా ఆరోపిస్తున్న అంశం. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎంగా కేసీఆర్ పూర్తి కాలం పదవిలో ఉంటారా .. లేక కేటీఆర్ కు బాధ్యతలు అప్పజెప్పి దిల్లీ రాజకీయాలపై దృష్టి సారిస్తారా అని  ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు.
 

గతంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తదుపరి ముఖ్యమంత్రి కేటీఆర్ అని ప్రకటించారు కూడా. ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశం కూడా మరుగున పడింది. తాజాగా ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల ప్రచార సభలో ప్రధాని మోదీ బీఆర్ఎస్ సర్కారు ను విమర్శిస్తూ కేసీఆర్ నా దగ్గరకి వచ్చి నా కుమారుడు(కేటీఆర్) ని సీఎం చేసేందుకు మీ సహకారం కావాలని కోరినట్లు సంచలన ఆరోపణలు చేశారు.


ఆధారాలుంటే తప్ప ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి అబద్ధాలు ఆడరని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు కూడా. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ కొన్ని మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో ఆయనకు తదుపరి సీఎం మీరేనా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.


వీటికి కేటీఆర్ చాలా తెలివిగా సమాధానమిస్తున్నారు. మా సీఎం కేసీఆరే.. ఇప్పుడే కాదు మరో 20 ఏళ్లు ఆయనే మా నాయకుడు అంటూ ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ లు కుటుంబ పార్టీలు అని ఆరోపిస్తూ ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మలచుకున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతి పక్షాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మంత్రులు, కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ మాత్రం కేటీఆర్ సీఎం అనే వ్యాఖ్యానించినా ఆ పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. ఇదే క్రమంలో హరీశ్ రావుకి, కేటీఆర్ కు సమప్రాధాన్యం ఇస్తూ కేసీఆర్ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>