Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shamibe54b817-aab6-4d8b-8d0c-30e27b8ce0bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shamibe54b817-aab6-4d8b-8d0c-30e27b8ce0bf-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు పుష్కరకాలం తర్వాత సొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీ కావడంతో టీమిండియా కు తిరిగే లేకుండా పోయింది. ఇప్పటికే సొంత గడ్డపై భారత జట్టును ఓడించడం అసాధ్యం అన్న విషయం అన్ని టీమ్స్ కి తెలుసు. అయితే ఇది ముమ్మాటికి నిజమే అన్న విషయాన్ని ఇక ఈ వరల్డ్ కప్ ప్రస్థానం ద్వారా ప్రపంచ క్రికెట్కు అర్థమయ్యేలా చేస్తుంది టీం ఇండియా. ఇప్పటివరకు లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్లలో అన్నింటి విజయం సాధింShami{#}Nijam;Hardik Pandya;Mohammed Shami;New Zealand;Success;Father;Rohit Sharma;India;World Cupఆ రైతు బిడ్డ.. టీమిండియాకు వరల్డ్ కప్ అందిస్తాడా?ఆ రైతు బిడ్డ.. టీమిండియాకు వరల్డ్ కప్ అందిస్తాడా?Shami{#}Nijam;Hardik Pandya;Mohammed Shami;New Zealand;Success;Father;Rohit Sharma;India;World CupSat, 18 Nov 2023 16:30:00 GMTప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు పుష్కరకాలం తర్వాత సొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీ కావడంతో టీమిండియా కు తిరిగే లేకుండా పోయింది. ఇప్పటికే సొంత గడ్డపై భారత జట్టును ఓడించడం అసాధ్యం అన్న విషయం అన్ని టీమ్స్ కి తెలుసు. అయితే ఇది ముమ్మాటికి నిజమే అన్న విషయాన్ని ఇక ఈ వరల్డ్ కప్ ప్రస్థానం ద్వారా ప్రపంచ క్రికెట్కు అర్థమయ్యేలా చేస్తుంది టీం ఇండియా. ఇప్పటివరకు లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్లలో అన్నింటి విజయం సాధించిన భారత జట్టు.. సెమి ఫైనల్లో కూడా కఠినమైన ప్రత్యర్థి అయిన న్యూజిలాండ్ ను సైతం ఓడించి ఫైనల్ లో అడుగుపెట్టింది.


 ఏకంగా టీమ్ ఇండియా సమిష్టిగా రాణిస్తూ.. మంచి ఫలితాలను సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక రోహిత్ శర్మ తన వ్యూహాలతో ప్రత్యర్ధులను కోలుకోలేని దెబ్బ కొట్టడంలో కూడా సక్సెస్ అవుతూ ఉన్నాడు. అయితే భారత జట్టు ఇంత సక్సెస్ అవుతుంది అంటే అందులో కీలక పాత్ర పోషిస్తుంది సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ  చెప్పాలి. మొదట్లో అతను బెంచ్ కే పరిమితమైన.. హార్దిక్ గాయంతోఅతనికి జట్టులో చోటు దక్కింది. ఈ క్రమంలోనే వచ్చినప్పటి నుంచి ప్రతి మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టడమే లక్ష్యంగా బంతులను విసురుతున్నాడు. కేవలం 6 ఇన్నింగ్స్ లోనే ఇప్పటివరకు 23 క్రికెట్లు పడగొట్టాడు షమి. ఇక అయితే ఇవాళ సెమీఫైనల్ మ్యాచ్లో అయితే ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ఓటమిని శాసించాడు.


 యూపీలోని ఒక మారుమూల గ్రామంలో రైతు బిడ్డగా జన్మించాడు. అయితే అతని తండ్రి ఆశయాన్ని ఇప్పుడు నిజం చేశాడు అని చెప్పాలి. ఎందుకంటే అతని తండ్రికి కూడా ఫాస్ట్ బౌలర్ కావాలని కల ఉండేదట. ఈ క్రమంలోనే తనకు కుదరలేదు. కాబట్టి ఇక కొడుకునైనా స్టార్ బౌలర్ ను చేయాలని.. షమీకి క్రికెట్లో శిక్షణ ఇప్పించాడు. అయితే ఓసారి నెట్స్ లో షమి వేసిన రెండు బౌన్సర్లు చూసి గంగూలీ షాక్ అయ్యాడట. ఆ తర్వాత దాదా సిఫారసు తో అతన్ని పశ్చిమబెంగాల్ టీం లో చేర్చుకున్నారు. ఇక ఆ తర్వాత షమీ ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ఇప్పుడు ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్నాడు. దీంతో ఈ రైతు బిడ్డ షమి వరల్డ్ కప్ అందిస్తాడా అని అందరూ చర్చించుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>