MoviesChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anveshi2eeb2c11-6273-4c1f-9f53-d1c9488688b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anveshi2eeb2c11-6273-4c1f-9f53-d1c9488688b9-415x250-IndiaHerald.jpgవిడుదల తేదీ : నవంబర్ 17, 2023 నటీనటులు: అనన్య నాగళ్ల, విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అజయ్ ఘోష్ తదితరులు దర్శకుడు : వీజే ఖన్నా నిర్మాత: గణపతి రెడ్డి సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సినిమాటోగ్రఫీ: కెకె రావు ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో క్రైమ్‌, థ్రిల్లర్స్‌కి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రస్టింగ్‌గా ఫీలవుతున్నారు. మంచి కథ.. కథనాలతో వస్తే ఎంత చిన్న సినిమా అయినా సరే పెద్ద హిట్‌ అవుతుంది. దర్శకుడు కొత్త వాడా లేక నటీనటులు తెలిసినవారా తెలియనివారా ఇవేమి చూడడం లేదు కేవలం వారు ఎంటర్‌టైన్‌ అవుతున్ANVESHI{#}Ananya Pandey;KK;Simran Bagga;ajaygosh;ananya;dharan;prema;racha ravi;producer;Thriller;Producer;Hero;Joseph Vijay;Darsakudu;Chaitanya;Ananya Nagalla;Chitram;ajay;Reddy;Love;Cinema;Director;Audience;November;Yevaruరివ్యూ: అన్వేషి క్రైమ్‌ సస్పెన్స్‌ డ్రామా!రివ్యూ: అన్వేషి క్రైమ్‌ సస్పెన్స్‌ డ్రామా!ANVESHI{#}Ananya Pandey;KK;Simran Bagga;ajaygosh;ananya;dharan;prema;racha ravi;producer;Thriller;Producer;Hero;Joseph Vijay;Darsakudu;Chaitanya;Ananya Nagalla;Chitram;ajay;Reddy;Love;Cinema;Director;Audience;November;YevaruSat, 18 Nov 2023 08:40:14 GMTవిడుదల తేదీ : నవంబర్ 17, 2023

నటీనటులు: అనన్య నాగళ్ల, విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అజయ్ ఘోష్ తదితరులు
దర్శకుడు : వీజే ఖన్నా
నిర్మాత: గణపతి రెడ్డి
సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్
సినిమాటోగ్రఫీ: కెకె రావు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

ఈ మధ్య కాలంలో క్రైమ్‌, థ్రిల్లర్స్‌కి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రస్టింగ్‌గా ఫీలవుతున్నారు.  మంచి కథ.. కథనాలతో వస్తే ఎంత చిన్న సినిమా అయినా సరే పెద్ద హిట్‌ అవుతుంది. దర్శకుడు కొత్త వాడా లేక నటీనటులు తెలిసినవారా తెలియనివారా ఇవేమి చూడడం లేదు కేవలం వారు ఎంటర్‌టైన్‌ అవుతున్నారా లేదా అన్నది మాత్రమే చూస్తున్నారు. ఇలాంటి జోనర్స్‌ను ఎంచుకునే ముందు ఎంతో చక్కగా ఆలోచించి మరీ విజయాన్ని సాధిస్తున్నారు. అనన్యనాగళ్ల పెద్ద కళ్లతో ఎంతో చక్కగా మంచి పాత్రలో నటించి మెప్పించింది. ఇక హీరో విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా ఇద్దరూ కూడా జంటగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. హారర్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అలరించింది.


కథః విక్రమ్‌ హీరో (విజయ్‌ ధరణ్‌ దాట్ల) అను హీరోయిన్‌ (సిమ్రాన్‌ గుప్త) అనే అమ్మాయిని చూసి చూడగానే ప్రేమలో పడిపోతాడు. ఇక దాంతో ఆమె ప్రేమ కోసం ఆమె వెంట తిరుగుతుంటాడు. మారేడు కోన అనే గ్రామానికి హీరోయిన్‌ను వెతుక్కుంటూ వెళతాడు. అక్కడ కొన్ని అనుకోని పరిస్థితులను ఎదుర్కొంటాడు. వాటన్నిటిని తట్టుకుంటూ ఆ ఊరిలో జరిగే దారుణ హత్యల వెనకున్న రహస్యమేంటో కనుక్కుని ఆ ఊరిని ఊరి జనాలను కాపాడతాడు. ఇక ఈ రహస్యాలన్నీ మిస్టరీని హీరో ఎలా కనుక్కున్నాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే మరి.


కథనం విశ్లేషణ: ఊరిలో ఇన్ని హత్యలు జరుగుతుంటే దానికి ఎవరు పాల్పడుతున్నారు. అన్న విషయాన్ని దాన్ని హీరో ఛేదించే దిశగా దర్శకుడు కథను ఎలా మలిచాడు అన్నదే మెయిన్‌ పాయింట్‌. కొన్ని చిత్రాలు ఎంతో థిల్లింగ్‌గా ఉంటాయి. అయితే వాటికి అక్కడక్కడ డ్రామా..కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడిస్తూ సినిమాని జాగ్రత్తగా చిత్రీకరిస్తే ఆ దర్శకుడు హిట్‌ కొట్టినట్లే అని చెప్పవచ్చు. ఇక అన్వేషి చిత్రం విషయానికి వస్తే అదే సస్పెన్స్‌ని దర్శకుడు చివరి వరకు మెయిన్‌టెయిన్‌ చేస్తూ ప్రేక్షకులను చక్కగా అలరించారని చెప్పవచ్చు. కొంత రొమాన్స్‌ కూడా ఉండడంతో యూత్‌ కూడా ఈ చిత్రానికి కనెక్ట్‌ అవుతారు. అదే విధంగా ఎక్కడా కూడా వల్గారిటీ అనే చూపించలేదు.


ప్రధాన పాత్రల్లో కనిపించిన నటీనటులందరూ చక్కగా తమ తమ పాత్రలకు అనుగుణంగా నటించారు. ఇక హీరోయిన్‌ క్యారెక్టర్‌ కూడా నేటి యువతకి బాగా కనెక్ట్‌ అవుతుంది. అనన్య నాగళ్ల డాక్టర్‌ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఇక ఆమె పాత్ర విషయానికి వస్తే దర్శకుడు ఎంతో అందంగా మలిచాడు. ఆమెను ఎంతగానో ప్రేమిస్తూ ఆరాధిస్తున్న ఓ భగ్న ప్రేమికుడి పాత్రలో నటించిన వారు కూడా క్లైమాక్స్‌లో నటన చింపేశాడనే చెప్పాలి. ఇక అజయ్‌ ఘోష్‌ నటన గురించి అందరికీ తెలిసిందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  రచ్చ రవి పాత్ర చిన్నదైన తనవరకు బాగానే చేశాడు.


సాంకేతిక నిపుణులుః ముందుగా కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ గురించి చెప్పుకుంటే.. దర్శకుడు ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా మలిచాడు. ఆడియన్స్‌ ఎక్కడా కూడా బోర్‌ ఫీలవకుండా చేశాడు. కాస్త సినిమా నిడివిని కొంత తగ్గించి ఉంటే బావుండేదనిపించింది. ఇంకాస్త గ్రిప్పింగ్‌ అనేది పొందేవారేమో ఎడిటింగ్‌ డిపార్ట్‌మెంట్‌వారు అనిపిస్తుంది. అదే విధంగా పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. పెద్ద సినిమాల్లో పాటలు చిత్రీకరించినట్లు చేశారు. హీరో.. హీరోయిన్లు ఇద్దరూ కూడా డాన్స్‌ బాగా చేశారు. చైతన్య భరద్వాజ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. నిర్మాత గణపతి రెడ్డి ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ బావున్నాయి. ఎక్కడా కూడా తగ్గకుండా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాని ఫ్యామిలీ మొత్తం చక్కగా కలిసి చూడవచ్చు. నీట్‌ అండ్‌ క్లీన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.

రేటింగ్ : 3/5



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>