SpiritualityDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/usirichattu-food-eatingcc1e4686-8e01-4fc8-89b6-ca7170a01ff0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/usirichattu-food-eatingcc1e4686-8e01-4fc8-89b6-ca7170a01ff0-415x250-IndiaHerald.jpgమన పురాణాలు,సంప్రదాయాలు ప్రకారం కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది.కార్తీక మాసంలో శివుని ఆరాధించాలని,ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయాలనే చెబుతున్నాయి.సాధారణంగా ఉసిరిని లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పండు అని చెబుతూ ఉంటారు.అలాంటి ఉసిరి చెట్టు కింద భోజనం చేయడంతో చాలా రకాల సమస్యలు తొలగుతాయని,ఇంకా చెప్పాలి అంటే పుణ్యం లభిస్తుందని కూడా చెబుతున్నారు.అస్సలు ఉసిరి చెట్టు కింద భోజనం చేయడంతో కలిగే లాభాలు తెలిస్తే తప్పకుండా భోజనం చేస్తారని చెబుతున్నారు.అవేంటో తెలుసుకుందాం పదండీ.. ఉసిరి చెట్టు కింద భోజనం చేUSIRICHATTU;FOOD;EATING{#}Indian gooseberry;Lakshmi Devi;vishnu;Airకార్తీక మాసంలో ఉసిరిచెట్టు కింద భోజనం చేయడంతో ఇన్ని ప్రయోజనాలా..!కార్తీక మాసంలో ఉసిరిచెట్టు కింద భోజనం చేయడంతో ఇన్ని ప్రయోజనాలా..!USIRICHATTU;FOOD;EATING{#}Indian gooseberry;Lakshmi Devi;vishnu;AirSat, 18 Nov 2023 06:00:00 GMTమన పురాణాలు,సంప్రదాయాలు ప్రకారం కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది.కార్తీక మాసంలో శివుని ఆరాధించాలని,ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయాలనే చెబుతున్నాయి.సాధారణంగా ఉసిరిని లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పండు అని చెబుతూ ఉంటారు.అలాంటి ఉసిరి చెట్టు కింద భోజనం చేయడంతో చాలా రకాల సమస్యలు తొలగుతాయని,ఇంకా చెప్పాలి అంటే పుణ్యం లభిస్తుందని కూడా చెబుతున్నారు.అస్సలు ఉసిరి చెట్టు కింద భోజనం చేయడంతో కలిగే లాభాలు తెలిస్తే తప్పకుండా భోజనం చేస్తారని చెబుతున్నారు.అవేంటో తెలుసుకుందాం పదండీ..

ఉసిరి చెట్టు కింద భోజనం చేసే పద్దతి..

ఉసిరి చెట్టు కింద భోజనం చేయడానికి ముందుగా విష్ణువుని ఆరాధించాలి దీని కోసం లక్ష్మీ సమేత విష్ణువుని,శివుణ్ణి ఫోటో పెట్టి,పూజలు చేసి ఉసిరి చెట్టు చెట్టు ఎనిమిది దీపాలను ఉంచాలి.ప్రసాదాలను అర్పించి కుటుంబమంతా భోజనం చేయడం వల్ల మంచి జరుగుతుంది.

ఇలా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల ఇంట్లోని గొడవలు సమస్యలు తొలగిపోయి,కుటుంబమంతా మనశ్శాంతిగా ఉంటుంది.ఎల్లప్పుడూ కొట్టుకునే భార్యాభర్తలు ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల విష్ణు లక్ష్మీ సమేత విష్ణువు యొక్క వారి మధ్య వివాదాలు తొలగుతాయి.

అంతేకాక ఆర్థిక ఇబ్బందులు,అప్పులతో బాధపడేవారు ఉసిరి దీపాలను శివునికి అర్పించడంతో వారికి,వారి వృత్తి,ఉద్యోగాలలో వృద్ధి చెంది,ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.లక్ష్మి దేవి అనుగ్రహంతో మొండి బకాయిలు కూడా తిరిగి వస్తాయి.

మరియు అనారోగ్య సమస్యలతో బాధపడే వారు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం మంచిది.అక్కడ భోజనం చేయడంతో ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి మరియు ఉసిరికాయలో ఉన్న సుగుణాలు ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా తగ్గించేస్తుంది.

కావున ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న,ఆర్థిక ఇబ్బందులు వున్నా,కుటుంబ కలహాలు వున్నా వాటిని నిరోదించుకోవడానికి కచ్చితంగా దేవుని అనుగ్రహం కోసం, నవగ్రహ దోష నివారణ కోసం ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం ఉత్తమం.మీరు కూడా ఇందులో ఏ సమస్యతో బాధపడుతుంటే,ఈ కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు కింద భోజనం చేసి చుడండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>