EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/etelaef163296-6ccf-4404-971b-96565e6c0336-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/etelaef163296-6ccf-4404-971b-96565e6c0336-415x250-IndiaHerald.jpgఈటల రాజేందర్ ఎవరో కాదు. నా కుడిభుజం లాంటోడు ఇవి ఎవరో చెప్పిన మాటలు కాదు. 2018 ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ ని ఉద్దేశించి ఉన్న మాటలు. ఆయన అన్నట్లుగానే ఈటల టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. తెలంగాణ పోరాటంలో కేసీఆర్ వెన్నంటే నడిచారు. ఏమైందో తెలియదు కానీ.. ఈటల పలు సందర్భాల్లో మేమే టీఆర్ఎస్ పార్టీ ఓనర్లం అంటూ ప్రకటించారు. ఆ తర్వాత మంత్రి పదవి నుంచి తొలగించడం ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగిపోయాయి. ఇప్పుడు గజ్వేల్ లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ కేసీఆర్ పై బరిలో నిలిETELA{#}KCR;Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;రాజీనామా;lord siva;Maha;Shakti;Huzurabad;Telangana;Minister;CM;Party;Bharatiya Janata Partyగజ్వేల్‌లో ఈటల.. కేసీఆర్‌కు షాక్ ఇచ్చేస్తారా?గజ్వేల్‌లో ఈటల.. కేసీఆర్‌కు షాక్ ఇచ్చేస్తారా?ETELA{#}KCR;Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;రాజీనామా;lord siva;Maha;Shakti;Huzurabad;Telangana;Minister;CM;Party;Bharatiya Janata PartySat, 18 Nov 2023 07:33:00 GMTఈటల రాజేందర్ ఎవరో కాదు. నా కుడిభుజం లాంటోడు ఇవి ఎవరో  చెప్పిన మాటలు కాదు. 2018 ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ ని ఉద్దేశించి ఉన్న మాటలు. ఆయన అన్నట్లుగానే ఈటల టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. తెలంగాణ పోరాటంలో కేసీఆర్ వెన్నంటే నడిచారు. ఏమైందో తెలియదు కానీ.. ఈటల పలు సందర్భాల్లో మేమే టీఆర్ఎస్ పార్టీ ఓనర్లం అంటూ ప్రకటించారు. ఆ తర్వాత మంత్రి పదవి నుంచి తొలగించడం ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగిపోయాయి.


ఇప్పుడు గజ్వేల్ లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ కేసీఆర్ పై బరిలో నిలిచారు. దీంతో పాటు ఆయన సొంత నియోజకవర్గం అయిన హుజూరాబాద్ లోను పోటీలో ఉన్నారు. అయితే గజ్వేల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అభిమన్యుడిలా వెళ్తున్నాను అర్జునుడిలా తిరిగి వస్తాను అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.  ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటో అర్థం కాక ప్రజలు సంశయంలో పడ్డారు.


మహా భారతం ఏం చెబుతుంది అంటే ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నినప్పుడు దీనిని చేధించగలిగే శక్తి సామర్థ్యాలు పాండవుల్లో ఒక్క అర్జునుడికే ఉన్నాయని ద్రోణాచార్యుడే వ్యాఖ్యానించారు. అందువల్ల అర్జునుడిని ఎవరైనా దూరం తీసుకెళ్తే నేను పద్మవ్యూహం పన్ని ధర్మరాజును బంధిస్తాను అని పేర్కొన్నారు. అయితే అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడమే తప్ప బయటకి రావడం తెలియదు.


అర్జునుడిని తప్ప మిగతా పాండవులను జయించే వరాన్ని శివుడు సైంధవుడుకి ప్రసాదించాడు. ఆ వరాన్ని  పద్మవ్యూహం పన్నినప్పుడు సైంధవుడు ఉపయోగించుకుంటాడు. సైంధవుడు పాండవులకు అడ్డుపడతాడు. అభిమన్యుడు ఓడిపోతాడు. ఇది కథ. ఈటల చెప్పిన లెక్క ప్రకారం అభిమన్యుడిలా వెళ్లడం కుదరదు. అర్జునుడిలా రావడం జరగదు.  బహుశా అభిమన్యుడిలా గజ్వేల్ లో ప్రవేశించి.. అర్జునుడిలా హుజురాబాద్ లో బయట పడతారు కావొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో..?



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>