MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb05eeaf3-a080-4f34-9c0c-d35594adc569-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb05eeaf3-a080-4f34-9c0c-d35594adc569-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతూ ఉంటాయి. అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో తెలియకుండానే రకరకాల పుకార్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు చాలామంది ఆకతాయిలు. ఇక హీరోయిన్ల విషయంలో ఎటువంటి వార్తలను ప్రచారం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదో ఒక పుకారు వైరల్ కావడం అందులో నిజం లేదు అంటూ సెలబ్రిటీలు క్లారిటీ ఇవ్వడం ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సైతం ఇలాంటి ఒక రూమర్ పై తాజాగా స్పందించింది. దీంతో ఈtollywood{#}Nijam;Alia Bhatt;News;media;bollywood;Husband;Heroineరణబీర్, ఆలియా భట్ ల మధ్య గొడవలు.. క్లారిటీ ఇచ్చిన ఆలియా..!?రణబీర్, ఆలియా భట్ ల మధ్య గొడవలు.. క్లారిటీ ఇచ్చిన ఆలియా..!?tollywood{#}Nijam;Alia Bhatt;News;media;bollywood;Husband;HeroineFri, 17 Nov 2023 16:10:00 GMTసాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతూ ఉంటాయి. అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో తెలియకుండానే రకరకాల పుకార్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు చాలామంది ఆకతాయిలు. ఇక హీరోయిన్ల విషయంలో ఎటువంటి వార్తలను ప్రచారం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదో ఒక పుకారు వైరల్ కావడం అందులో నిజం లేదు అంటూ సెలబ్రిటీలు క్లారిటీ ఇవ్వడం ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సైతం ఇలాంటి ఒక రూమర్ పై తాజాగా స్పందించింది.

దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.  అయితే ఆలియా భట్ మరియు తన భర్త మధ్య గొడవలు జరుగుతున్నాయి అని వీరిద్దరి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తాయి అని కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ వార్తలు పై క్లారిటీ ఇచ్చింది ఆలియా భట్. ప్రముఖ టాక్‌ షో 'కాఫీ విత్‌ కరణ్‌' లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ కరీనా కపూర్‌, అలియా భట్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ర్యాపిడ్ ఫైర్‌లో భాగంగా కరణ్‌ అడిగిన ప్రశ్నలకు అలియా బదులిచ్చారు. ఇందులో భాగంగానే తన వైవాహిక జీవితంపై వచ్చిన పుకార్లపై అలియా స్పందించింది.

 ఈ సందర్భంగా అలియా మాట్లాడుతూ.. 'ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంటుంది. గతంలో నాపై కొన్ని పుకార్లు వచ్చాయి. నేను సన్నగా మారడానికి, తెల్లగా అవ్వడానికి సర్జరీలు చేయించుకున్నారి దుష్ఫ్రచారం చేశారు. అలాగే నా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయంటూ పుకార్లు వచ్చాయి. అయితే వీటిలో ఏవీ నిజం లేదు. అందుకే నేను వాటిని అస్సలు పట్టించుకోలేదు. ఇలాంటి పుకార్లు నన్ను బాధించవు' అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. అలా వీరిద్దరి మధ్య వచ్చే గొడవలకి సంబంధించిన పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టింది ఆలియా భట్. దీంతో అలియా భట్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>