Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc2419a121-1793-4de9-969a-1b5576c61fb0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc2419a121-1793-4de9-969a-1b5576c61fb0-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్లో అరవీర భయంకరమైన టీం గా పేరున్న సౌత్ ఆఫ్రికా జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది అన్న విషయం తెలిసిందే అత్యుత్తమ ఆటగాళ్లను కలిగి ఉన్న ఈ జట్టు ను ఎప్పుడు దురదృష్టం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది ఎందుకంటే వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంటులో మొదట్లో మంచి ప్రదర్శన చేసే సౌతాఫ్రికా కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో మాత్రం చేతులెత్తేస్తూ ఉంటుంది. దీంతో ఆ దేశ అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోతూ ఉంటారు అని చెప్పాలి. ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న 2023 వన్డే ప్రపంచIcc{#}South Africa;Australia;World Cup;Cricket;Indiaసెమీ ఫైనల్లో ఓటమి.. రిటైర్మెంట్ ప్రకటించిన 30 ఏళ్ల స్టార్ ప్లేయర్?సెమీ ఫైనల్లో ఓటమి.. రిటైర్మెంట్ ప్రకటించిన 30 ఏళ్ల స్టార్ ప్లేయర్?Icc{#}South Africa;Australia;World Cup;Cricket;IndiaFri, 17 Nov 2023 09:15:00 GMTప్రపంచ క్రికెట్లో అరవీర భయంకరమైన టీం గా పేరున్న సౌత్ ఆఫ్రికా జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది అన్న విషయం తెలిసిందే  అత్యుత్తమ ఆటగాళ్లను కలిగి ఉన్న ఈ జట్టు ను ఎప్పుడు దురదృష్టం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది  ఎందుకంటే వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మకమైన  టోర్నమెంటులో మొదట్లో మంచి ప్రదర్శన చేసే సౌతాఫ్రికా కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో మాత్రం చేతులెత్తేస్తూ ఉంటుంది. దీంతో ఆ దేశ అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోతూ ఉంటారు అని చెప్పాలి.


 ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న 2023 వన్డే ప్రపంచ కప్ టోర్నీలో కూడా ఇదే జరిగింది. మొదట్లో ఓటములతో సతమతమైన సౌత్ ఆఫ్రికా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా భారీగా స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులపై పూర్తి అధిపత్యాన్ని చలాయించింది. ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో దూసుకు వచ్చి ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. సౌత్ ఆఫ్రికా దూకుడు చూస్తే సెమీఫైనల్ లో ఎంతో అలవోకక విజయం సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పటిలాగానే ఒత్తిడికి తలోగ్గింది సౌత్ ఆఫ్రికా. దీంతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తప్పలేదు.


 ఎన్నో ఏళ్ల నుంచి వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఓడిపోతూ వస్తున్న సౌత్ ఆఫ్రికా మరోసారి ఇదే పరంపరను కొనసాగించింది. సౌత్ ఆఫ్రికా ఓటమితో తీవ్ర నిరాశ చెందిన ఆ జట్టు వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ఇక తన వన్డే కెరియర్ కు రిటర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారిపోయింది. ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్ కనబరిచి నాలుగు సెంచరీలతో రాణించిన అతను 30 ఏళ్లకే వన్డేలకు వీడ్కోలు పలకడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా తన చివరి వరల్డ్ కప్ లో 594 పరుగులు చేశాడు డికాక్. కాగా ఇక ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఇప్పుడు కేవలం టి20 లకు మాత్రమే జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>