PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modic6b30725-1e4e-406c-a433-51585ea6e3fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modic6b30725-1e4e-406c-a433-51585ea6e3fa-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో డీప్ ఫేక్ వీడియోలు బాగా కలకలం రేపుతున్నాయి. కొందరు కావాలని హీరోయిన్ల ఫొటోలతో ఆ వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ చేస్తున్నారు.అభ్యంతరకర దృశ్యాలతో ఉన్న ఈ వీడియోలు సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫాంలపై దర్శనమిస్తుండటం బాగా ఆందోళన కలిగిస్తోంది. వేరొకరి ముఖాల స్థానంలో హీరోయిన్లు రష్మిక మందన్న, కాజోల్ ఇంకా కత్రినా కైఫ్ లాంటి స్టార్ల ముఖాలను మార్ఫింగ్ చేసి రూపొందించిన ఈ వీడియోలు నిజమైనవే అని భ్రమించేలా ఎంతగానో ఆందోళన కలిగించాయి. ఇక తారలే కాదు.. ప్రధాNarendra Modi{#}Kajol;Katrina Kaif;Narendra Modi;rashmika mandanna;Diwali;Prime Minister;Bharatiya Janata Partyతన ఫేక్ పాటలపై రియాక్ట్ అయిన మోడీ?తన ఫేక్ పాటలపై రియాక్ట్ అయిన మోడీ?Narendra Modi{#}Kajol;Katrina Kaif;Narendra Modi;rashmika mandanna;Diwali;Prime Minister;Bharatiya Janata PartyFri, 17 Nov 2023 18:34:00 GMTసోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో డీప్ ఫేక్ వీడియోలు బాగా కలకలం రేపుతున్నాయి. కొందరు కావాలని హీరోయిన్ల ఫొటోలతో ఆ వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ చేస్తున్నారు.అభ్యంతరకర దృశ్యాలతో ఉన్న ఈ వీడియోలు సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫాంలపై దర్శనమిస్తుండటం బాగా ఆందోళన కలిగిస్తోంది. వేరొకరి ముఖాల స్థానంలో హీరోయిన్లు రష్మిక మందన్న, కాజోల్ ఇంకా కత్రినా కైఫ్ లాంటి స్టార్ల ముఖాలను మార్ఫింగ్ చేసి రూపొందించిన ఈ వీడియోలు నిజమైనవే అని భ్రమించేలా ఎంతగానో ఆందోళన కలిగించాయి. ఇక తారలే కాదు.. ప్రధాని లాంటి ప్రజాప్రతినిధులను కూడా డీప్ ఫేక్ తో మార్ఫింగ్ చేసి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం..ఇక ఈ సమస్య ఎంత పెద్ద విపత్తుగా మారిందో అర్ధం చేసుకోవచ్చు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఓ పాట పడినట్టు డీప్ ఫేక్ వీడియో సృష్టించడం దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఇలాంటి వీడియోలపై బాగా ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ డీప్ ఫేక్ వీడియోలపై స్పందించారు. డీప్ ఫేక్ వీడియోలు మన వ్యవస్థకు పెను ముప్పుగా మారుతున్నాయని అవి సమాజంలో గందరగోళానికి దారితీస్తున్నాయంటూ మోడీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది  కొత్త సవాలుగా మారిందని.. ఇది మరింత సమస్యాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో దీపావళి మిలన్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. చాలా మంది వినియోగదారులు కృత్రిమ మేధస్సు బారిన పడుతుండటంపై ఎంతగానో ఆందోళన వ్యక్తంచేశారు.


ఈ సందర్భంగా తన మొఖంతో మార్ఫింగ్ చేసిన వీడియో గురించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.“ఈమధ్య నేను పాడే వీడియో చూశాను. దాన్ని నాకు నచ్చిన వారు ఫార్వార్డ్ చేసారు. ఆ వీడియోలో నేను పాట పాడుతున్నట్టుగా చూపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలని రూపొందిస్తున్నారు. ఇది నిజంగా సమస్యాత్మకమైన అంశం. డీప్ ఫేక్ వీడియోల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వీడియోలపై మీడియా, పాత్రికేయులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలి. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంపై ప్రజలను ఖచ్చితంగా సన్నద్ధం చేయాలి” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇంకా అంతేకాదు, వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోలను గుర్తించి, వాటిని ఫ్లాగ్ చేసి హెచ్చరికలు జారీ చేయాలని కూడా చాట్ జీపీటీ బృందాన్ని కోరినట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>