Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-47978ebe-beba-43ba-8ad9-51f6fe79c249-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-47978ebe-beba-43ba-8ad9-51f6fe79c249-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్ని తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే లీగ్ దశ నుంచి కూడా ప్రేక్షకులు ఊహించని రీతిలో అన్ని టీమ్స్ కూడా ప్రదర్శనలు చేశాయి. కొన్ని టీమ్స్ అంచనాలను అందుకోలేక నిరాశపరిస్తే మరికొన్ని జట్లు మాత్రం అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఈ వరల్డ్ కప్ లో ప్రతి జట్టులోని ఆటగాళ్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ.. పరుగుల ప్రవాహాన్ని పారించారు. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో కూడా సెంచరీల మూత మోగింది అని చెప్పాలి. అయితే ఇలాంటి అద్భుతమైన ప్రదరCricket {#}Rohit Sharma;Narendra Modi;South Africa;Australia;World Cup;Audience;November;Indiaడేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. ఆస్ట్రేలియా నుండి ఒకే ఒక్కడు?డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. ఆస్ట్రేలియా నుండి ఒకే ఒక్కడు?Cricket {#}Rohit Sharma;Narendra Modi;South Africa;Australia;World Cup;Audience;November;IndiaFri, 17 Nov 2023 08:50:00 GMTప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్ని తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే లీగ్ దశ నుంచి కూడా ప్రేక్షకులు ఊహించని రీతిలో అన్ని టీమ్స్ కూడా ప్రదర్శనలు చేశాయి. కొన్ని టీమ్స్ అంచనాలను అందుకోలేక నిరాశపరిస్తే మరికొన్ని జట్లు మాత్రం అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఈ వరల్డ్ కప్ లో ప్రతి జట్టులోని ఆటగాళ్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ.. పరుగుల ప్రవాహాన్ని పారించారు.


 ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో కూడా సెంచరీల మూత మోగింది అని చెప్పాలి. అయితే ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనతో ఎంతోమంది ఆటగాళ్లు అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నారు. ఇలా ఈ వరల్డ్ కప్ టోర్నీలో మంచి ఫామ్ కనబరిచిన ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ కూడా ఒకరు. ఆస్ట్రేలియా జట్టును గెలిపించడంలో వార్నర్ పాత్ర ఎంతో కీలకంగా ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఆస్ట్రేలియా జట్టు సెమి ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ని ఓడించి ఫైనల్ లో అడుగు పెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో అటు డేవిడ్ వార్నర్ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు.


 ప్రపంచ కప్ రెండు ఎడిషన్స్ లో కలిపి ఏకంగా 500 ప్లస్ పరుగులు చేసిన తొలి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ గా నిలిచాడు డేవిడ్ వార్నర్. 2019, 2023 వరల్డ్ కప్ లలో ఇలా 500 ప్లస్ పరుగులు చేశాడు. ఓవరాల్ గా ఈ లిస్టులో వార్నర్ కంటే ముందు సచిన్ టెండూల్కర్.. 1996, 2003 వరల్డ్ కప్ లలో 500 ప్లస్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ గా ఉండగా.. రోహిత్ శర్మ 2019, 2023 వరల్డ్ కప్లలో ఈ ఘనత సాధించిన ప్లేయర్ గా ఉన్నాడు. అయితే రోహిత్ వార్నర్ మాత్రమే వరుసగా రెండు వరల్డ్ కప్లలో 500 ప్లస్ స్కోర్ చేసిన ప్లేయర్లుగా ఘనత సాధించారు. కాగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్టు నవంబర్ 19వ తేదీన నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>