PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-madhira-bhatti-tdp-congress431c44ab-0c48-43d5-832d-9fa15017e912-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-madhira-bhatti-tdp-congress431c44ab-0c48-43d5-832d-9fa15017e912-415x250-IndiaHerald.jpgఅయితే కాసాని చెప్పిన మాటలను లోకేష్ ఖండించారు. పోటీచేయటానికి తమ పార్టీ సిద్ధంగా లేదు కాబట్టే తాము పోటీనుండి తప్పుకున్నట్లు లోకేష్ కలరింగ్ ఇచ్చుకున్నారు. అయితే ఇపుడు కాసాని చెప్పిందే నిజమని అర్ధమైంది. తుమ్మల, భట్టి ప్రచారంలో, ర్యాలీల్లో కాంగ్రెస్ నేతలు, క్యాడర్ తో కలిసి టీడీపీ నేతలు ప్రచారం చేయటంలేదని ఇపుడు కూడా లోకేష్ చెప్పగలరా ? కాసానితో పాటు మరికొందరు నేతలు ఎన్నికల్లో పోటీచేయాల్సిందే అని ఎంత చెప్పినా చంద్రబాబు మాత్రం అంగీకరించలేదు. telangana madhira bhatti tdp congress{#}Nara Lokesh;రాజీనామా;Nalgonda;CBN;TDP;Lokesh;Lokesh Kanagaraj;Khammam;Congress;Partyహైదరాబాద్ : కాంగ్రెస్-టీడీపీ కలిసిపోయాయా ?హైదరాబాద్ : కాంగ్రెస్-టీడీపీ కలిసిపోయాయా ?telangana madhira bhatti tdp congress{#}Nara Lokesh;రాజీనామా;Nalgonda;CBN;TDP;Lokesh;Lokesh Kanagaraj;Khammam;Congress;PartyFri, 17 Nov 2023 03:00:00 GMT

తెలంగాణా ఎన్నికల్లో ఎంచక్కా కాంగ్రెస్+టీడీపీ కలిసి పనిచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ కు పనిచేయమని, కాంగ్రెస్ కు ఓట్లేయించాలన్నది చంద్రబాబునాయుడు వ్యూహం కాదని, తమ అధినేత ఎప్పుడూ అలా చెప్పలేదని ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గొంతు చించుకున్నారు. అయితే గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది మాత్రం లోకేష్ ప్రకటనకు పూర్తి విరుద్ధం. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులకు టీడీపీ నేతలు, క్యాడర్ పనిచేస్తున్నారన్నది నూరుశాతం నిజం.





కాంగ్రెస్ అభ్యర్ధులు తుమ్మల నాగేశ్వరరావు, మల్లు భట్టి విక్రమార్క ప్రచారంలో టీడీపీ నేతలు, క్యాడర్ కూడా పూర్తి ఇన్వాల్వ్ మెంటుతో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ కు ఓట్లేయించటం, కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించటమే టార్గెట్ గా తెలంగాణా ఎన్నికల  నుండి టీడీపీ తప్పుకున్నది అన్నది వాస్తవం. ఈ విషయాన్ని చంద్రబాబు ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. అయితే చంద్రబాబు-టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కు మధ్య జరిగిన చర్చలను కాసాని మీడియాకు గతంలోనే చెప్పారు.





అయితే కాసాని చెప్పిన మాటలను లోకేష్ ఖండించారు. పోటీచేయటానికి తమ పార్టీ సిద్ధంగా లేదు కాబట్టే తాము పోటీనుండి తప్పుకున్నట్లు లోకేష్ కలరింగ్ ఇచ్చుకున్నారు.  అయితే ఇపుడు కాసాని చెప్పిందే నిజమని అర్ధమైంది. తుమ్మల, భట్టి ప్రచారంలో, ర్యాలీల్లో కాంగ్రెస్ నేతలు, క్యాడర్ తో కలిసి టీడీపీ నేతలు ప్రచారం చేయటంలేదని ఇపుడు కూడా లోకేష్ చెప్పగలరా ? కాసానితో పాటు మరికొందరు నేతలు ఎన్నికల్లో పోటీచేయాల్సిందే అని ఎంత చెప్పినా చంద్రబాబు మాత్రం అంగీకరించలేదు.





చంద్రబాబు వైఖరి కారణంగానే  తాను టీడీపీకి రాజీనామా చేసినట్లు కాసాని మీడియాతోనే చెప్పారు. నిజానికి టీడీపీ నుండి చాలామంది నేతలు ఇతర పార్టీల్లో చేరిపోయారు. అయితే నియోజకవర్గాల్లో అంతో ఇంతో అభిమానులు, మద్దతుదారులు ఇంకా మిగిలేఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎక్కువమంది మద్దతుదారులున్నారు. మరి తెలంగాణా వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్ధులకు టీడీపీ మద్దతు ఇస్తున్నదా లేదా  అన్నది చూడాలి. టీడీపీ మద్దతువల్ల కాంగ్రెస్ అభ్యర్ధులకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా లేదా అన్నది ఇపుడే చెప్పేందుకు లేదు. 




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>