Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccd9fb0897-1bdf-4d67-b488-1399a78fe5cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccd9fb0897-1bdf-4d67-b488-1399a78fe5cd-415x250-IndiaHerald.jpgఎన్నో రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ వస్తున్న వరల్డ్ కప్ టోర్నీ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నీ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో చివరికి ఫైనల్ లో రెండు టీమ్స్ ఫైనల్ లో అడుగుపెట్టాయి. మొదటి సెమి ఫైనల్లో గెలిచి టీమిండియా ఫైనల్ లో అడుగు పెడితే అటు రెండో సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికా పై విజయం సాధించి ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుకుంది. ఈ రెండు కూడా వరల్డ్ కప్ లో పటిష్టమIcc{#}BCCI;Prime Minister;Narendra Modi;South Africa;Champion;Yevaru;October;Cricket;Australia;World Cupవరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం.. ధూమ్ ధాం ఏర్పాట్లు?వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం.. ధూమ్ ధాం ఏర్పాట్లు?Icc{#}BCCI;Prime Minister;Narendra Modi;South Africa;Champion;Yevaru;October;Cricket;Australia;World CupFri, 17 Nov 2023 10:30:00 GMTఎన్నో రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ వస్తున్న వరల్డ్ కప్ టోర్నీ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నీ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో చివరికి ఫైనల్ లో రెండు టీమ్స్ ఫైనల్ లో అడుగుపెట్టాయి.  మొదటి సెమి ఫైనల్లో గెలిచి టీమిండియా ఫైనల్ లో అడుగు పెడితే అటు రెండో సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికా పై విజయం సాధించి ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుకుంది. ఈ రెండు కూడా వరల్డ్ కప్ లో పటిష్టమైన టీమ్స్ గానే కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు వన్డే ఫార్మాట్ లో ఐదుసార్లు ప్రపంచ  ఛాంపియన్ గా కొనసాగుతుంది. ఇక టీమిండియా రెండుసార్లు వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలిచింది.


 మొదట్లో వరుస ఓటములతో సతమతమైన ఆస్ట్రేలియా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ఇక మొదటి నుంచి వరుస విజయాలతో సత్తా చాటుతుంది టీమిండియా. ఈ క్రమంలోనే ఫైనల్ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రస్తుతం ఐసీసీ, బీసీసీఐ ధూమ్ ధాం ఏర్పాట్లు చేస్తుంది అన్నది తెలుస్తుంది  మ్యాచ్ ప్రారంభానికి ముందు వరల్డ్ కప్ ముగింపు వేడుకలు జరుగుతాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని ప్లాన్స్ సిద్ధం చేసుకుందట ఐసీసీ, బీసీసీఐ.



 ఇక ఈ ముగింపు వేడుకలలో భాగంగా ప్రముఖ సింగర్ దువా లిఫా ప్రత్యేక ప్రదర్శన ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో భారత వైమానిక దళంతో ఎయిర్ షో కూడా నిర్వహించబోతున్నారట. అంతేకాదు ఈ ఫైనల్ మ్యాచ్ ను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు అటు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించడానికి స్టేడియం కి వస్తారట. ఇక పెద్ద ఎత్తున ఈ ఫైనల్ మ్యాచ్ కి సినీ రాజకీయ ప్రముఖులు తరలి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక స్టేడియంలో ప్రత్యేక లేజర్ షో కూడా ఏర్పాటు చేయబోతున్నారట. 1,32,000 సీట్ల కెపాసిటీ ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>