Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9d688ebc-a5ff-4498-857a-00e168198dfa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9d688ebc-a5ff-4498-857a-00e168198dfa-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో ఆర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సౌత్ ఇండస్ట్రీలో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య. ఆర్య నటించిన తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయం సాధించాయి. అయితే ఆర్య ఓ కొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్‌సిరీస్ 'ది విలేజ్‌'. ఈ వెబ్ సిరీస్ కు మిలింద్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో'లో ఈ వsocialstars lifestyle{#}gourav;Muthu;arya;Aryaa;prasad;Jaan;Divya Bhatnagar;Hero;John;Kannada;king;Kollywood;Heroine;Shakti;Cinema;November;Tamilఇంట్రెస్ట్ పెంచుతున్న కోలీవుడ్ స్టార్ హీరో మూవీ ట్రైలర్ ..!!ఇంట్రెస్ట్ పెంచుతున్న కోలీవుడ్ స్టార్ హీరో మూవీ ట్రైలర్ ..!!socialstars lifestyle{#}gourav;Muthu;arya;Aryaa;prasad;Jaan;Divya Bhatnagar;Hero;John;Kannada;king;Kollywood;Heroine;Shakti;Cinema;November;TamilFri, 17 Nov 2023 22:25:00 GMTకోలీవుడ్ స్టార్ హీరో ఆర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సౌత్ ఇండస్ట్రీలో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య.  ఆర్య నటించిన తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయం సాధించాయి. అయితే ఆర్య ఓ కొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆర్య  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్‌సిరీస్ 'ది విలేజ్‌'. ఈ వెబ్ సిరీస్ కు మిలింద్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో'లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సిరిస్ నుంచి మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు.. ఇక ట్రైలర్ గమనిస్తే.. తన ఫ్యామిలీతో కలిసి ఆర్య ఒక భయంకరమైన గ్రామంలో చిక్కుకుంటాడు. అయితే అక్కడున్న వింత మనుషుల నుంచి తన ఫ్యామిలీని రక్షించుకునేందుకు ఆర్య ఏవిధంగా సాహసాలు చేస్తాడు అనేది సిరీస్ స్టోరీ.  ఈ వెబ్ సిరీస్ గ్రాఫిక్‌ నవల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ సిరీస్‌ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ మరియు కన్నడ భాషల్లో నవంబరు 24న స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో ఆర్య సరసన  దివ్య పిళ్లై హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే ఈ వెబ్ సిరీస్ లో ఆడుకాలం నరేన్, ఆజియా, తలైవాసల్ విజయ్, ముత్తు కుమార్, కలై రాణి, జార్జ్ ఎం, జాన్ కొక్కెన్, జయ ప్రకాష్ మరియు పిఎన్ సన్నీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో శక్తి ప్రొడక్షన్ బ్యానర్‌పై గౌరవ్ శ్రీవాస్తవ్ మరియు ప్రసాద్ పట్నాయక్ నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే ఆర్య తెలుగులో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ హీరోగా నటిస్తున్న  'సైంధవ్‌' సినిమా లో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>