Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl25f19dd4-3650-46a4-9320-1bcb0fce907e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl25f19dd4-3650-46a4-9320-1bcb0fce907e-415x250-IndiaHerald.jpgబిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే 2008లో ఒక సాదాసీదా దేశీయ టి20 లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ ఇక ఇప్పుడు ప్రపంచక్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఈ ఐపీఎల్లో వరల్డ్ క్రికెట్లో ఉన్న స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా భాగం కావాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ టోర్నీలో పాల్గొనడం వల్ల ఒకవైపు భారీగా ఆదాయంతో పాటు మరోవైపు ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ప్లేయర్స్ తో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం ఉంIpl{#}Indian;Australia;Cricketఐపీఎల్ వేలంలోకి.. ఆస్ట్రేలియా కెప్టెన్.. భారీ ధర ఖాయమా?ఐపీఎల్ వేలంలోకి.. ఆస్ట్రేలియా కెప్టెన్.. భారీ ధర ఖాయమా?Ipl{#}Indian;Australia;CricketWed, 15 Nov 2023 14:00:00 GMTబిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే 2008లో ఒక సాదాసీదా దేశీయ టి20 లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ ఇక ఇప్పుడు ప్రపంచక్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఈ ఐపీఎల్లో వరల్డ్ క్రికెట్లో ఉన్న స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా భాగం కావాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ టోర్నీలో పాల్గొనడం వల్ల ఒకవైపు భారీగా ఆదాయంతో పాటు మరోవైపు ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ప్లేయర్స్ తో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం ఉంటుంది.


 ఇక ఐపీఎల్ లో ఎవరైనా ఆటగాడు మంచి ప్రదర్శన చేశాడు అంటే చాలు అతని పేరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మారి మోగిపోతూ ఉంటుంది అని చెప్పాలి. దీంతో మహామహా స్టార్ ప్లేయర్లు సైతం ఐపీఎల్ లో పాల్గొనడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది ప్లేయర్లు మాత్రం గత కొంతకాలం నుంచి ఐపీఎల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మ్యాచ్లో ఆడటం కంటే దేశం తరఫున ఒక్క మ్యాచ్ ఆడటానికే తాము ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాము అంటూ గతంలో కొంతమంది ప్లేయర్లు వ్యాఖ్యలు చేశారు.


 ఇలాంటి కామెంట్స్ చేసిన వారిలో పాట్ కమిన్స్ కూడా ఒకరు అని చెప్పాలి. కాగా ఐపీఎల్ 2024 వేలానికి తాను అందుబాటులో ఉంటాను అంటూ ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. గత ఐపీఎల్ సీజన్ కు అతను దూరమయ్యాడు అని చెప్పాలి. ఇక మళ్ళీ 2024 ఐపీఎల్ సీజన్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మొదటినుంచి ఈ ఆటగాడు ఐపీఎల్ పై పెద్దగా దృష్టి సారించి లేదు. ఇప్పటివరకు కేవలం 42 మ్యాచ్లు మాత్రమే ఆటాడు  తనకు 100 ఐపీఎల్ మ్యాచ్లు ఆడటం కన్నా.. ఆస్ట్రేలియా తరఫున ఒక్క మ్యాచ్ చాలా ముఖ్యం అంటూ గతంలో కామెంట్స్ కూడా చేశాడు. ఈ స్టార్ ప్లేయర్ వేలంలోకి వస్తే భారీ ధర పలికే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>