EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/lokesh08a4a01d-2df9-404f-895c-df8a9e2f1c29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/lokesh08a4a01d-2df9-404f-895c-df8a9e2f1c29-415x250-IndiaHerald.jpgజాతీయ పార్టీలు అయితే అధికారంలోకి వచ్చే వరకు ఎవరు సీఎం అవుతారో చెప్పలేం. అదే ప్రాంతీయ పార్టీలు అయితే అభ్యర్థిని ముందుగానే చెప్పవచ్చు. అభ్యర్థులను చూసే ప్రజలు ఓటేస్తారు. బీఆర్ఎస్ కు కేసీఆర్, వైసీపీకి జగన్, టీడీపీకి చంద్రబాబు ఇలా. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నేనే అంటూ కేసీఆర్ ప్రకటించారు కూడా. కానీ జాతీయ పార్టీలకు ఆ స్వేచ్ఛ ఉండదు. ఒకవేళ కేసీఆర్ తర్వాత ఆ పార్టీ నాయకుడు ఎవరు అంటే వెంటనే కేటీఆర్ అని చెబుతారు. అదే టీడీపీ అయితే నారా లోకేశ్. అయితే ఇద్దరిలో ఎవరు గొప్ప అంLOKESH{#}KTR;KCR;Nara Lokesh;TDP;Telangana;Yevaru;Andhra Pradesh;Assembly;Minister;Party;Telugu;CBNకేటీఆర్.. లోకేశ్‌.. వారసుడిగా ఎవరు బెటర్‌?కేటీఆర్.. లోకేశ్‌.. వారసుడిగా ఎవరు బెటర్‌?LOKESH{#}KTR;KCR;Nara Lokesh;TDP;Telangana;Yevaru;Andhra Pradesh;Assembly;Minister;Party;Telugu;CBNWed, 15 Nov 2023 00:00:00 GMTజాతీయ పార్టీలు అయితే అధికారంలోకి వచ్చే వరకు ఎవరు సీఎం అవుతారో చెప్పలేం. అదే ప్రాంతీయ పార్టీలు అయితే అభ్యర్థిని ముందుగానే చెప్పవచ్చు.  అభ్యర్థులను చూసే ప్రజలు ఓటేస్తారు.  బీఆర్ఎస్ కు కేసీఆర్, వైసీపీకి జగన్, టీడీపీకి చంద్రబాబు ఇలా. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నేనే అంటూ కేసీఆర్ ప్రకటించారు కూడా. కానీ జాతీయ పార్టీలకు ఆ స్వేచ్ఛ ఉండదు.


ఒకవేళ కేసీఆర్ తర్వాత ఆ పార్టీ నాయకుడు ఎవరు అంటే వెంటనే కేటీఆర్ అని చెబుతారు. అదే టీడీపీ అయితే నారా లోకేశ్.  అయితే ఇద్దరిలో ఎవరు గొప్ప అంటూ అటు ఏపీ ప్రజలు, ఇటు తెలంగాణ ప్రజలు సందర్భం వచ్చినప్పుడల్లా చర్చించుకుంటారు. వాస్తవానికి కేటీఆర్ విషయానికొస్తే ఆయన ఉద్యమం నుంచి వచ్చిన నేత. తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. ప్రస్తుతం భారాస కార్వనిర్వాహక అధ్యక్షుడిగా తన బాధ్యతలకు న్యాయం చేస్తున్నారు.


తెలంగాణ కేబినెట్ లో కూడా కేసీఆర్ తర్వాత కేటీఆరే అని అంటుంటారు. ఆ విధంగా ఆయన పలు సభల్లో హామీలు సైతం ప్రకటించారు. నారా లోకేశ్ విషయానికొస్తే లోకేశ్ నేరుగా చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవి చేపట్టారు. ఆయనకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. ప్రారంభంలో ఆయన తెలుగు మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు పాదయాత్రల పేరుతో పరిస్థితి కొంత మెరుగయ్యింది.


కాబినేట్ విషయానికొస్తే చంద్రబాబే అన్ని విషయాలను చూసుకునేవారు తప్ప లోకేశ్ ను ఎక్కువగా ఇన్వాల్వ్ చేయలేదు. అంటే కేటీఆర్ లా స్వతంత్రంగా నిర్ణయం తీసుకును అవకాశం చంద్రబాబు కల్పించలేదు. తెలంగాణలో అయితే కేటీఆర్ వర్కింగ్ ప్రెసెడెంట్ పదవితో పాటు, మంత్రి పదవి బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. లోకేశ్ లో ఇంకా తన రాజకీయ పరిణితి చూపించే అవకాశం రాలేదు. చంద్రబాబు జైలుకి వెళ్లిన తర్వాత మాత్రమే ఆయన టీడీపీ నేతలతో సమావేశాలు వంటివి నిర్వహించారు. పూర్తి స్థాయి బాధ్యతలు లోకేశ్ ఇప్పటి వరకు చేపట్టలేదు. ఇటువంటి సమయంలో ఇద్దరినీ పోల్చి చూడటం సరి కాదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>