MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood21eb8982-d6c9-43fa-9259-03e29904127d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood21eb8982-d6c9-43fa-9259-03e29904127d-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చిరుత అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ సినిమా హిట్ కాగా ఉత్తమ పురుష డెబ్యూగా ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకున్నారు చరణ్. దాని తర్వాత రామ్ వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ఎప్పుడు బయటికి వస్తుంది అనే సమాచారం తెలియదు,గ్లిమ్ప్స్ బయటికి tollywood{#}Chirutha;shankar;GEUM;Director;Dil;dil raju;Ram Charan Teja;News;ram pothineni;Hero;Cinema;Indiaగేమ్ చేంజర్ విషయంలో మాట తప్పుతున్న రామ్ చరణ్..!?గేమ్ చేంజర్ విషయంలో మాట తప్పుతున్న రామ్ చరణ్..!?tollywood{#}Chirutha;shankar;GEUM;Director;Dil;dil raju;Ram Charan Teja;News;ram pothineni;Hero;Cinema;IndiaWed, 15 Nov 2023 16:04:00 GMTమెగాస్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చిరుత అనే సినిమాతో సినీ  ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ సినిమా హిట్ కాగా ఉత్తమ పురుష డెబ్యూగా ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకున్నారు చరణ్. దాని తర్వాత రామ్ వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ఎప్పుడు బయటికి వస్తుంది అనే సమాచారం తెలియదు,గ్లిమ్ప్స్ బయటికి వస్తుందా

 అంటే దిల్ రాజుకి అది కూడా తెలియదు. పోనీ కనీసం గేమ్ చేంజ్ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అయినా చెప్పండి అంటే డైరెక్టర్ శంకర్ కైనా దానికి సమాధానం తెలుసో లేదో చూడాలి. ఒక స్టార్ హీరో చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా విషయంలో ఇలా జరగడం అభిమానులని అప్సెట్ చేసే విషయమే. అయితే రీసెంట్ గా సాంగ్ రిలీజ్ అనుకున్నారు కానీ అది కూడా కాకపోవడంతో మాట తప్పుతున్న అన్నా అంటూ మెగా సినీ లవర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అయితే ఏడాదికి ఒక సినిమా తప్పకుండా రిలీజ్ చేస్తాను అంటూ రామ్ చరణ్ ఫాన్స్ కి మాటిచ్చాడు.

అయితే ఇప్పుడు ఇది గేమ్ చేంజర్ కారణంగా అవ్వట్లేదు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ ఏడాదికి ఒక సినిమా చేస్తానని చెప్పారు. ఆచార్య సినిమా 2022లోనే రిలీజ్ చేశారు. 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు చరణ్ సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. ఏడాదిన్నర అయినప్పటికీ గేమ్ చేంజెర్ సినిమా ఇప్పటికీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియని పరిస్థితి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు గేమ్ చేంజర్ మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ తర్వాతే రిలీజ్ కానుంది. అయితే మరి ఈ రెండేళ్లలో రామ్ చరణ్ టైం కి వర్క్ అనిపించే హిట్ సినిమాని శంకర్ ఇస్తాడో లేదో చూడాలి మరి..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>