Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc047467f5-dac6-446c-b1e8-45978e9129c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc047467f5-dac6-446c-b1e8-45978e9129c8-415x250-IndiaHerald.jpgభారత్ వేదికగా జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు ఎంత దారుణమైన ప్రస్థానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటిలాగానే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్.. ఎక్కడ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇక వరల్డ్ కప్ ప్రారంభంలో వరుసగా రెండు విజయాలు సాధించి దూకుడు చూపించిన ఈ టీం.. ఆ తర్వాత మాత్రం వరుసగా 5 పరాజయాలు సాధించి డీలా పడిపోయింది. అయితే సెమీఫైనల్ అవకాశాలను దాదాపు కోల్పోయింది అనుకుంటున్న సమయంలో.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లపై విజయం Icc{#}రాజీనామా;Pakistan;Dookudu;New Zealand;World Cup;Directorవరల్డ్ కప్ లో ఘోర ఓటమి.. పాక్ బోర్డు సంచలన నిర్ణయం?వరల్డ్ కప్ లో ఘోర ఓటమి.. పాక్ బోర్డు సంచలన నిర్ణయం?Icc{#}రాజీనామా;Pakistan;Dookudu;New Zealand;World Cup;DirectorWed, 15 Nov 2023 13:30:00 GMTభారత్ వేదికగా జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీ లో పాకిస్తాన్ జట్టు ఎంత దారుణమైన ప్రస్థానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటిలాగానే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్.. ఎక్కడ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేక పోయింది. ఇక వరల్డ్ కప్ ప్రారంభంలో వరుసగా రెండు విజయాలు సాధించి దూకుడు చూపించిన ఈ టీం.. ఆ తర్వాత మాత్రం వరుసగా 5 పరాజయాలు సాధించి డీలా పడిపోయింది.


 అయితే సెమీ ఫైనల్ అవకాశాలను దాదాపు కోల్పోయింది అనుకుంటున్న సమయం లో.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లపై విజయం సాధించినప్పటికీ ఆ జట్టుకు సెమీఫైనల్ అవకాశాలు దక్కలేదు. దీంతో ఇక లీగ్ దశతోనే సరిపెట్టుకొని టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఈ క్రమం లోనే పాకిస్తాన్ జట్టు ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ లో చిన్న టీమ్స్ చేతుల్లో ఓడిపోయి చెత్త రికార్డులు సాధించింది పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ జట్టును ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చేసింది అంటూ ఎంతో మంది మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



 వరల్డ్ కప్ లో ఘోర ఓటమి తర్వాత అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టు లో ఉన్న విదేశీ కోచింగ్ సిబ్బంది మొత్తాన్ని కూడా తొలగించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఇలా పాకిస్తాన్ జట్టు నుంచి తొలగిస్తున్న విదేశీ కోచ్ లలో టీం డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయంపై పిసిబి చీఫ్ జాకా అశ్రప్ పాకిస్తాన్ క్రికెటర్లతో చర్చలు కూడా జరుపుతున్నారట. పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ పదవికి మోర్న మోర్కల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>