PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-cid8a886ca9-e830-425d-915b-5db32fdcbac4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-cid8a886ca9-e830-425d-915b-5db32fdcbac4-415x250-IndiaHerald.jpgస్కిల్ స్కామ్ లో చంద్రబాబు రు. 371 కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ఆరోపించింది. ఆరోపించటమే కాకుండా ఆధారాలను కూడా కోర్టు ముందుంచింది. సీఐడీ చూపించిన ఆధారాలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండు విధించింది. ఆ స్కామ్ లో రు. 371 కోట్లు వివిధ మార్గాల్లో షెల్ కంపెనీల్లోకి వెళ్ళాయని సీఐడీ కనుక్కున్నది. అందులోని ఒక షెల్ కంపెనీ ద్వారా రు. 27 కోట్లు టీడీపీ ఖాతాలో జమైనట్లు సీఐడీ గుర్తించింది. tdp chandrababu cid{#}ATCHANNAIDU KINJARAPU;TDP;Anti-Corruption Bureau;Rajahmundry;CBN;court;Partyఅమరావతి : టీడీపీకి సీఐడీ షాక్అమరావతి : టీడీపీకి సీఐడీ షాక్tdp chandrababu cid{#}ATCHANNAIDU KINJARAPU;TDP;Anti-Corruption Bureau;Rajahmundry;CBN;court;PartyWed, 15 Nov 2023 03:00:00 GMT

తెలుగుదేశంపార్టీకి సీఐడీ మరో షాక్ ఇచ్చింది. పార్టీకి సంబంధించిన  ఖాతా వివరాలను వెంటనే ఇవ్వాలని నోటీసులో స్పష్టంగా చెప్పింది. ఈనెల 18వ తేదీకల్లా మొత్తం వివరాలను సీఐడీ ఆఫీసుకు తీసుకురావాలని పార్టీ జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ కు చెప్పింది. విషయం ఏమిటంటే  స్కిల్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టయి 53 రోజులు రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. మెడికల్ గ్రౌండ్స్ లో మధ్యంతర బెయిల్ తెచ్చుకుని ఇపుడు బయటున్నారు. ఈనెల 28వ తేదీన మళ్ళీ రాజమండ్రి జైలులో లొంగిపోవాలి.





స్కిల్ స్కామ్ లో చంద్రబాబు రు. 371 కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ఆరోపించింది. ఆరోపించటమే కాకుండా ఆధారాలను కూడా కోర్టు ముందుంచింది. సీఐడీ చూపించిన ఆధారాలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండు విధించింది. ఆ  స్కామ్ లో రు. 371 కోట్లు వివిధ మార్గాల్లో షెల్ కంపెనీల్లోకి వెళ్ళాయని సీఐడీ కనుక్కున్నది. అందులోని ఒక షెల్ కంపెనీ ద్వారా రు. 27 కోట్లు టీడీపీ ఖాతాలో జమైనట్లు సీఐడీ గుర్తించింది.





పార్టీ ఖాతాలో పడిన రు. 27 కోట్ల గురించి వివరాలు తెలుసుకునేందుకే గతంలో కూడా పార్టీకి నోటీసిచ్చింది. అయితే నోటీసును చాలెంజ్ చేస్తు టీడీపీ కోర్టులో కేసువేసింది. తమ ఖాతాలో స్కిల్ స్కామ్ డబ్బు జమకాలేదని లోకేష్, అచ్చెన్నాయుడు పదేపదే చెబుతున్నారు. తమ పార్టీకి వచ్చిన విరాళాలంతా అభిమానులు, మద్దతుదారులు ఇచ్చిందే అని వాదిస్తున్నారు. అయితే ఒక్కసారిగా రు. 27 కోట్లు పార్టీ ఖాతాలో ఎలా జమయ్యాయో చెప్పమంటే మాత్రం మాట్లాడటంలేదు.





అందుకనే సీఐడీ విచారణకు రావాలని ఆడిటర్ కు నోటీసిచ్చింది. స్కిల్ స్కామ్ ఆడిటర్, పార్టీ ఖాతాలు చూసే ఆడిటర్ ఒక్కళ్ళే అని కూడా సీఐడీ ఆరోపించింది. అయితే సీఐడీ విచారణకు రావటానికి పార్టీ నిరాకరిస్తోంది. అందుకనే నోటీసులను చాలెంజ్ చేస్తు కోర్టులో కేసు వేసింది. మరాకేసు ఏమైందో ఏమో తాజాగా పార్టీ జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. మరీసారి టీడీపీ ఏమిచేస్తుందో చూడాలి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>