MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood03b085c3-a628-4ad9-b917-dd22a21d173b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood03b085c3-a628-4ad9-b917-dd22a21d173b-415x250-IndiaHerald.jpg'RX 100' మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి తాజాగా పాయల్ రాజ్ పుత్ తో 'మంగళవారం' అనే సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీ నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ మలయాళ భాషల్లో విడుదల అవుతుంది. సినిమా విడుదల సందర్భంగా అజయ్ భూపతి మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.మంగళవారం ఐడియా ఎలా వచ్చింది? కథకు స్ఫూర్తి ఏంటి? అని అడగగా.. ఈ మూవీ ఐడియా ఎప్పుడు వచ్చిందనేది కచ్చితంగా చెప్పలేను. మహాసముద్రం షూటింగ్లో ఉండగా మంగళవారం చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇంతకుముందు రెండు tollywood{#}Payal Rajput;ajay;Kannada;Audience;Idea;Manam;Heroine;tuesday;Cinemaఇలాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు .. అజయ్ భూపతి ..!!ఇలాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు .. అజయ్ భూపతి ..!!tollywood{#}Payal Rajput;ajay;Kannada;Audience;Idea;Manam;Heroine;tuesday;CinemaTue, 14 Nov 2023 14:30:00 GMT'RX 100' మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి తాజాగా పాయల్ రాజ్ పుత్ తో 'మంగళవారం' అనే సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే.  ఈ మూవీ నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ మలయాళ భాషల్లో విడుదల అవుతుంది. సినిమా విడుదల సందర్భంగా అజయ్ భూపతి మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.మంగళవారం ఐడియా ఎలా వచ్చింది? కథకు స్ఫూర్తి ఏంటి? అని అడగగా.. ఈ మూవీ ఐడియా ఎప్పుడు వచ్చిందనేది కచ్చితంగా చెప్పలేను. మహాసముద్రం షూటింగ్లో ఉండగా మంగళవారం చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇంతకుముందు రెండు సినిమాల కంటే కథ రాసేటప్పుడు గాని తీసేటప్పుడు ఎక్కువ టెన్షన్ ఫీల్ అయ్యాను. 

కానీ కాంటెంపరరీ కథతో క్యారెక్టర్ బేస్డ్ సినిమాగా కమర్షియల్ విలువలతో మంగళవారం మూవీని తీసా. ఇటువంటి సినిమాకు దర్శకత్వం వహించడం అంత సులభం కాదు. సినిమాకు అన్ని బాగా కుదిరాయి" అంటూ చెప్పారు. పాయల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అనే ప్రశ్నకు బదిలిస్తూ ఆమె క్యారెక్టర్ చూసి ఆడియన్స్ అంతా షాక్ అవుతారు. జీవితంలో ఎప్పుడూ చేయనటువంటి పర్ఫామెన్స్ ఈ సినిమాలో పాయల్ చేసింది" అని చెప్పుకొచ్చాడు.హీరోయిన్ గా ముందు నుంచే పాయల్ ను అనుకున్నారా? అని అడిగితే.." లేదు. టీనేజ్ ఎండింగ్ లో ఉన్న అమ్మాయితో చేద్దామని ముందు అనుకున్నా.

 సుమారు 40, 50 మందిని ఆడిషన్స్ చేసా. గ్రామీణ నేపథ్యానికి సూట్ అయ్యేలా ఇన్నోసెంట్ ఫేస్ ఉండాలి. ప్రీ ప్రొడక్షన్ టైంలో హీరోయిన్ సెలక్షన్ కోసమే ఎక్కువ టైం పట్టింది.
 ఆ సమయంలో పాయల్ నుంచి మెసేజ్ వచ్చింది. మళ్ళీ మనం సినిమా చేద్దామని. రెండు రోజులు టైం తీసుకుని, నేను విజువలైజ్ చేసుకున్నాకే ఓకే చేశా" అని అన్నారు. 'అప్పడప్పడతాండ్ర' పాట ఫైనల్ కట్ నుంచి తీసేడానికి కారణం ఏంటని అడగ్గా.." పాటలో చాలామంది మనోభావాలు దెబ్బతీసేలా లిరిక్స్ ఉంటాయని సెన్సార్ ఆఫీసర్లు ఫీలయ్యారు. ఒక్క కట్ కూడా ఇవ్వలేదు. సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.  రెండు మూడు రోజుల్లో ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తాం" అని అన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>