DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/revath-reddy294bc4a9-ea24-44d1-a643-bf08c03fae74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/revath-reddy294bc4a9-ea24-44d1-a643-bf08c03fae74-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఎన్నికల్లో అసలు ఘట్టం మొదలైంది. నామినేషన్ల పర్వం ముగిసింది. రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మహా మహులు, పార్టీ అధ్యక్షులు ఒకే చోట పోటీలో ఉండటంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పోటీచేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పోటీలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఆయన సొంత నియోజకవర్గమైన కొడంగల్ బరిలో కూడా ఉండనున్నారు. రేవంత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా అక్కడక్కడ టీడీపీ జెండాలు కనిపించాయని బీఆర్ఎస్ సోషల్ మీడియా విస్త్రృతంగా revath reddy{#}Khammam;Kamareddy;Kodangal;Revanth Reddy;Maha;media;KCR;Elections;TDP;Congress;Partyరేవంత్‌ కోసం కాంగ్రెస్, టీడీపీ చేతులు కలిపాయా?రేవంత్‌ కోసం కాంగ్రెస్, టీడీపీ చేతులు కలిపాయా?revath reddy{#}Khammam;Kamareddy;Kodangal;Revanth Reddy;Maha;media;KCR;Elections;TDP;Congress;PartyTue, 14 Nov 2023 13:00:00 GMTతెలంగాణ ఎన్నికల్లో అసలు ఘట్టం మొదలైంది. నామినేషన్ల పర్వం ముగిసింది. రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మహా మహులు, పార్టీ అధ్యక్షులు ఒకే చోట పోటీలో ఉండటంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పోటీచేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పోటీలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఆయన సొంత నియోజకవర్గమైన కొడంగల్ బరిలో కూడా ఉండనున్నారు.


రేవంత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా అక్కడక్కడ టీడీపీ జెండాలు కనిపించాయని బీఆర్ఎస్ సోషల్ మీడియా విస్త్రృతంగా ప్రచారం చేస్తోంది. అయితే 2018లో ఆంధ్రా సెంటిమెంట్ తో కాంగ్రెస్ ను చావుదెబ్బ కొట్టిన కేసీఆర్ ఈ సారి కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తారని అనుకోవడం లేదు. ఎందుకంటే ఈసారి టీడీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. టీడీపీ ఓటు బ్యాంకు కూడా కేసీఆర్ కు అవసరమే కాబట్టి ఆయన మరోసారి ఆంధ్రా సెంటిమెంట్ రగల్చే ప్రయత్నం చేయరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


మరోవైపు రేవంత్ రెడ్డి కూడా అంత తెలివి తక్కువ తనంగా వ్యవహరించరు. గతంలో దెబ్బతిన్న తర్వాత కూడా అలాంటి ప్రయత్నాలు ఆయన చేయరు. అసలు కొడంగల్ లో టీడీపీ ప్రాతినిథ్యం లేదు. అక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్యే. కూకట్ పల్లి, హైదరబాద్ పరిసర ప్రాంతాలతో పాటు, ఖమ్మం లాంటి చోట్ల టీడీపీ బలంగా ఉంది. అక్కడ  ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తారంటే జనం నమ్ముతారు ఏమో కానీ కొడంగల్ లో  ఆ పరిస్థితి లేదు.


అయితే సోషల్ మీడియా వార్తలను పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. రాజకీయ పార్టీలకు ప్రచారం కావాలి. అది నిజమా, అబద్ధమా వారికి అనవసరం. ఎవరికీ అనుకూలంగా వారు పోస్టులు పెడుతుంటారు. ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకు జనాల్ని తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి పోస్టులు పెడుతుంటారు. కాబట్టి ఇలాంటి వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>