MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-684536fd-6b13-4121-bb67-be4506aac345-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-684536fd-6b13-4121-bb67-be4506aac345-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటికే ఈ సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. మొదటగా బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే తాజాగా బాలకృష్ణ ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా భగవంత్ కేసరి మూవీ తో మరోసారి ప్రేక్షకులను పలకరించి మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో రెండు విజయాలను అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ తాజాగా బాబి కొల్Balayya {#}lion;Simha;Kesari;Sangeetha;Dussehra;Vijayadashami;Josh;Makar Sakranti;Box office;News;Balakrishna;sree;Cinema"ఎన్బికె 109" కి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..?"ఎన్బికె 109" కి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..?Balayya {#}lion;Simha;Kesari;Sangeetha;Dussehra;Vijayadashami;Josh;Makar Sakranti;Box office;News;Balakrishna;sree;CinemaTue, 14 Nov 2023 11:40:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటికే ఈ సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. మొదటగా బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే తాజాగా బాలకృష్ణ ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా భగవంత్ కేసరి మూవీ తో మరోసారి ప్రేక్షకులను పలకరించి మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో రెండు విజయాలను అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ తాజాగా బాబి కొల్లి దర్శకత్వంలో ఓ మూవీ ని స్టార్ట్ చేశాడు.

మూవీ కి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ ని "ఎన్ బి కే 109" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలను ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిని మాత్రం ఇప్పటి వరకు కన్ఫామ్ చేయలేదు. ఇక ఇన్ని రోజుల పాటు ఈ మూవీ దర్శకుడు ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ ను సంగీత దర్శకుడుగా తీసుకోవాలి అని ప్రయత్నాలు సాగించినట్లు వార్తలు వచ్చాయి.

కాకపోతే అనిరుద్ ప్రస్తుతం అనేక సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడంతో ఈ సినిమాకు పని చేసే సమయం లేకపోవడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడుగా కన్ఫామ్ చేసుకున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరో ఒకటి రెండు రోజుల్లో ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>