MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6bbccd1d-4e41-45b7-8fcf-5a52b91af1b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6bbccd1d-4e41-45b7-8fcf-5a52b91af1b6-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజ రవితేజ దసరాకి టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ప్రస్తుతం ఈగల్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మాస్ రాజా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు రవితేజ. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్స్ సైతం ప్రారంభించారు. అయితే ఈ సినిమా తర్వాత రవితేజ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాtollywood{#}anil music;Makar Sakranti;Darsakudu;Kick;Raja The Great;Akkineni Nageswara Rao;Ravi;ravi teja;media;Audience;Balakrishna;Director;dil raju;Mass;News;Cinemaఆ స్టార్ డైరెక్టర్ తో నెక్స్ట్ మూవీ సెట్ చేసిన రవితేజ..!?ఆ స్టార్ డైరెక్టర్ తో నెక్స్ట్ మూవీ సెట్ చేసిన రవితేజ..!?tollywood{#}anil music;Makar Sakranti;Darsakudu;Kick;Raja The Great;Akkineni Nageswara Rao;Ravi;ravi teja;media;Audience;Balakrishna;Director;dil raju;Mass;News;CinemaTue, 14 Nov 2023 17:15:00 GMTమాస్ మహారాజ రవితేజ దసరాకి టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ప్రస్తుతం ఈగల్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మాస్ రాజా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు రవితేజ. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్స్ సైతం ప్రారంభించారు. అయితే ఈ సినిమా తర్వాత రవితేజ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న వార్తలు

ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. తెలుగులో ఫ్లాప్ సినిమా లేని దర్శకుడు ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు అనిల్ రావిపూడి. ఇప్పటికే రవితేజ తో రాజా ది గ్రేట్ సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆడియన్స్ కి ఒక మంచి కిక్ ఇచ్చే సినిమాని అందించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్‌గా బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. రాజా ది గ్రేట్ సినిమాలో బ్లైండ్‌గా కనిపించి అదిరిపోయే ఎంటర్టైనింగ్ ఇచ్చాడు రవితేజ.

దీంతో మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయితే రవితేజ మార్క్ సాలిడ్ ఎంటర్టైనర్ పడడం గ్యారెంటీ. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే.. ఈ సినిమా రాజా ది గ్రేట్‌కి సీక్వెల్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇక ఈసారి రవితేజ అనిల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం మాస్ మహారాజ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>