HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsc2171b34-8051-4801-9482-47dde714c320-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsc2171b34-8051-4801-9482-47dde714c320-415x250-IndiaHerald.jpgపుట్టగొడుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులలో విటమిన్ డి, బి2 ఇంకా బి3 కూడా ఉంటాయి. విటమిన్ డి లోపం ఉన్నవారికి ప్రతి రోజూ పుట్టగొడుగులను తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ పుట్టగొడుగు చాలా రుచికరంగా కూడా ఉంటుంది. చికెన్ లాంటి రుచి ఈ పుట్టగొడుగు సొంతం.ఇక పుట్టగొడుగులలో డి-ఫ్రాక్షన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది మన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. ఇంకా అలాగే వ్యాధులకు కూడా ఇది వ్యతిరేకంగా పోరాడుతుంది.యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కhealth tips{#}Potassium;Vitamin;Heart;Mushroom;Cancer;Chicken;Bacteria;Amino acids;Shaktiవింటర్లో ఖచ్చితంగా తినాల్సిన ఫుడ్ ఇదే?వింటర్లో ఖచ్చితంగా తినాల్సిన ఫుడ్ ఇదే?health tips{#}Potassium;Vitamin;Heart;Mushroom;Cancer;Chicken;Bacteria;Amino acids;ShaktiTue, 14 Nov 2023 15:47:00 GMTపుట్టగొడుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులలో విటమిన్ డి, బి2 ఇంకా బి3 కూడా ఉంటాయి. విటమిన్ డి లోపం ఉన్నవారికి ప్రతి రోజూ పుట్టగొడుగులను తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ పుట్టగొడుగు చాలా రుచికరంగా కూడా ఉంటుంది. చికెన్ లాంటి రుచి ఈ పుట్టగొడుగు సొంతం.ఇక పుట్టగొడుగులలో డి-ఫ్రాక్షన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది మన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. ఇంకా అలాగే వ్యాధులకు కూడా ఇది వ్యతిరేకంగా పోరాడుతుంది.యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను చలికాలంలో తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పుట్టగొడుగులు విటమిన్ డికి మంచి మూలంగా పరిగణించబడే ఆహారం. కాబట్టి విటమిన్ డి లోపం ఉన్నవారు ఆహారంలో ఖచ్చితంగా పుట్టగొడుగులను చేర్చుకోవడం మంచిది. మన ఎముకల ఆరోగ్యానికి పుట్టగొడుగులు మేలు చేస్తాయి.పుట్టగొడుగులలో అమినో యాసిడ్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి సెల్యులార్ డ్యామేజ్‌ను నివారిస్తాయి. ఇంకా అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.


సోడియం తక్కువగా ఇంకా పొటాషియం ఎక్కువగా ఉండే పుట్టగొడుగులను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు ఈజీగా అదుపులో ఉంటుంది. ఈ పుట్టగొడుగులకు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే సామర్థ్యం కూడా ఉంది.ఇక పీచు, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది తక్కువ కేలరీల గల కూరగాయ.పైగా ఇది బరువు తగ్గడానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది.ఫైబర్ పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను డయాబెటిక్ పేషంట్స్ వారి డైట్ లో కూడా చేర్చుకోవచ్చు. పుట్టగొడుగులు గట్ బాక్టీరియా సంఖ్యను పెంచడానికి, గట్ ఆరోగ్యాన్ని రక్షించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అమైనో ఆమ్లాలు కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>