Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccba466f99-672f-432e-a052-ee653475a85d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccba466f99-672f-432e-a052-ee653475a85d-415x250-IndiaHerald.jpgఎన్నో రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన వరల్డ్ కప్ టోర్నీ ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. రేపటి నుంచి ఈ వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే పాయింట్లు పట్టికలో మొదటి నాలుగు స్థానాలలో నిలిచిన టీమ్స్ లో భారత్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ నాలుగు టీమ్స్ కూడా ఫుల్ ఫామ్ లో ఉండడంతో విజేతగా ఎవరు నిలుస్తారు అనే విషయంపై ముందుగా ఒక అంచనా వేయలేకపోతున్నారు క్రికెట్ ప్రేక్Icc{#}West Indies;ICC T20;Australia;England;Cricket;New Zealand;World Cup;Yevaru;Indiaవాంఖడేలో ఇండియాకు సెమీస్ గండం.. కలవరపెడుతున్న గత రికార్డులు?వాంఖడేలో ఇండియాకు సెమీస్ గండం.. కలవరపెడుతున్న గత రికార్డులు?Icc{#}West Indies;ICC T20;Australia;England;Cricket;New Zealand;World Cup;Yevaru;IndiaTue, 14 Nov 2023 13:00:00 GMTఎన్నో రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్  పంచుతూ వచ్చిన వరల్డ్ కప్ టోర్నీ ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. రేపటి నుంచి ఈ వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే పాయింట్లు పట్టికలో మొదటి నాలుగు స్థానాలలో నిలిచిన టీమ్స్ లో భారత్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ నాలుగు టీమ్స్ కూడా ఫుల్ ఫామ్ లో ఉండడంతో విజేతగా ఎవరు నిలుస్తారు అనే విషయంపై ముందుగా ఒక అంచనా వేయలేకపోతున్నారు క్రికెట్ ప్రేక్షకులు.


 ఈ క్రమంలోనే ఈ సెమి ఫైనల్ మ్యాచ్లను చూసేందుకు తెగ ఆత్రుతగా ఉన్నారు అని చెప్పాలి. మరి ముఖ్యంగా లీగ్ దశలో వరుసగా 9 మ్యాచ్ లలో గెలిచి అజేయంగా నిలిచిన టీమిండియా ఇక తమకు ఎప్పుడు కఠినమైన సవాలను విసిరే న్యూజిలాండ్ ను ఎలా ఎదుర్కోబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా కు సంబంధించి గత రికార్డులు ఎలా ఉన్నాయి అన్న విషయం గురించే అటు అభిమానులు అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. న్యూజిలాండ్తో రికార్డులు.. అంతేకాదు ఇక మ్యాచ్ జరుగుతున్న వాంకడే స్టేడియంలో భారత గత గణాంకాలు ఎలా ఉన్నాయి అనేది విషయం ప్రస్తుతం చర్చకు వస్తుంది.


 అయితే న్యూజిలాండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతున్న వాంకడే స్టేడియంలో.. భారత జట్టుకు సెమీఫైనల్ గండం పొంచి ఉందట. కాగా ఈ స్టేడియంలో టీం ఇండియా గత రికార్డులు అభిమానులను కలవరపెడుతున్నాయి. వాంకడే స్టేడియం లోనే 2011 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకి ఈ గడ్డపై సెమీస్ మాత్రం అస్సలు ఆచ్చి రాలేదు. ఇదే వేదికగా వెస్టిండీస్ 2016లో t20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ టీమిండియాను ఓడించింది. 1987లో ఇదే మైదానంలో సెమీస్ లో ఇంగ్లాండ్ ఇండియాను ఓడించింది. రేపు జరగబోయే మ్యాచ్ ఏం జరుగుతుందో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>