Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc33d0306f-187a-489d-a578-e1ffb211807b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc33d0306f-187a-489d-a578-e1ffb211807b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ టోర్నీ కీలక దశకు చేరుకుంది. రేపటి నుంచి సెమి ఫైనల్ మ్యాచ్లు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ సెమీఫైనల్ కోసం అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే 2019లో న్యూజిలాండ్ ఎలా అయితే భారత జట్టును ఓడించి ఇంటికి పంపిందో.. ఇక ఇప్పుడు 2023 వరల్డ్ కప్ లో భారత జట్టు న్యూజిలాండ్ ఓడించి ప్రతీకారం తీర్చుకుంటుందని.. ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా బలంగా నమ్ముతున్నారు. సెమీఫైనల్ లో పోరు ఎలా ఉండబోIcc{#}VIRAT KOHLI;England;Cricket;New Zealand;World Cup;Bangladesh;Indiaప్రపంచ కప్ భారత్ దే.. ఇదిగో ప్రూఫ్?ప్రపంచ కప్ భారత్ దే.. ఇదిగో ప్రూఫ్?Icc{#}VIRAT KOHLI;England;Cricket;New Zealand;World Cup;Bangladesh;IndiaTue, 14 Nov 2023 10:46:38 GMTప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ టోర్నీ కీలక దశకు చేరుకుంది. రేపటి నుంచి సెమి ఫైనల్ మ్యాచ్లు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ సెమీఫైనల్ కోసం అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే 2019లో న్యూజిలాండ్ ఎలా అయితే భారత జట్టును ఓడించి ఇంటికి పంపిందో.. ఇక ఇప్పుడు 2023 వరల్డ్ కప్ లో భారత జట్టు న్యూజిలాండ్ ఓడించి ప్రతీకారం తీర్చుకుంటుందని.. ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా బలంగా నమ్ముతున్నారు.


 సెమీఫైనల్ లో పోరు ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే టీమ్ ఇండియా దూకుడు చూస్తూ ఉంటే.. తప్పకుండా ఈ వరల్డ్ కప్ లో టైటిల్ విజేతగా నిలుస్తుందని అభిమానులు అందరూ భావిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు పాత సెంటిమెంట్స్ చూసుకున్నా కూడా.. 2023 వరల్డ్ కప్ టీమిండియాదే అన్న విషయం అర్థమవుతుంది అని కొంతమంది విశ్లేషకులు సరికొత్త విషయాలను తెరమీదకి తెస్తున్నారు. 2011 వరల్డ్ కప్ లో ఏదైతే జరిగిందో ఇప్పుడు 2023 వరల్డ్ కప్ లో కూడా అదే రిపీట్ అవుతుంది అని  చెబుతున్నారు.


 ఇప్పటికే 9 విజయాలతో అజయంగా సెమిస్లు అడుగుపెట్టింది రోహిత్ సేన. అయితే 2011 వరల్డ్ కప్ తో పోల్చి చూస్తే ఈ వరల్డ్ కప్ కి చాలా పోలికలు ఉన్నాయి అని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరల్డ్ కప్ లో అత్యధిక రన్స్ చేదన.. ఫాస్టెస్ట్ వరల్డ్ కప్ సెంచరీ.. ఇక ఇంగ్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగడం.. బంగ్లాదేశ్ పై విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం.. ఇలా 2011 వరల్డ్ కప్ తో పోల్చి చూస్తే ప్రస్తుత వరల్డ్ కప్ కి కూడా ఎన్నో పోలికలు ఉన్నాయి. దీంతో ఇక అప్పుడు టీమిండియా టైటిల్ గెలిచినట్లుగానే ఇప్పుడు కూడా తప్పకుండా వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుంది అని అభిమానులు చర్చించుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>