MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/war-22219633c-a234-415f-b2a1-b2124e1390c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/war-22219633c-a234-415f-b2a1-b2124e1390c0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో మహేష్, పవన్ తరువాత అత్యధిక ఫ్యాన్స్ ఉన్న హీరో. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ క్రేజ్ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో పెరిగిపోయింది.కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా.. విదేశీ మూవీలవర్స్ కూడా ఫిదా అయ్యారు. అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాలలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు తారక్. దీంతో ఇప్పుడు తారక్ కొత్త సినిమాల కోసం ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిసWar 2{#}Ram Charan Teja;Alia Bhatt;Aly Khan;Deepika Padukone;Kiara Advani;Tiger Shroff;roshan;vani;GEUM;Komaram Bheem;Fidaa;war;NTR;Jr NTR;Shiva;lord siva;RRR Movie;Heroine;mahesh babu;Hero;Tollywood;News;Cinema;bollywood;India;Directorవార్ 2: ఆ హాట్ బ్యూటీతో రొమాన్స్ చేయనున్న తారక్?వార్ 2: ఆ హాట్ బ్యూటీతో రొమాన్స్ చేయనున్న తారక్?War 2{#}Ram Charan Teja;Alia Bhatt;Aly Khan;Deepika Padukone;Kiara Advani;Tiger Shroff;roshan;vani;GEUM;Komaram Bheem;Fidaa;war;NTR;Jr NTR;Shiva;lord siva;RRR Movie;Heroine;mahesh babu;Hero;Tollywood;News;Cinema;bollywood;India;DirectorTue, 14 Nov 2023 17:46:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో మహేష్, పవన్ తరువాత అత్యధిక ఫ్యాన్స్ ఉన్న హీరో. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ క్రేజ్ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో పెరిగిపోయింది.కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా.. విదేశీ మూవీలవర్స్ కూడా ఫిదా అయ్యారు. అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాలలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు తారక్. దీంతో ఇప్పుడు తారక్ కొత్త సినిమాల కోసం ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'దేవర'.  డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో తారక్ మరోసారి మాస్, యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ తార జాన్వీ కపూర్ హీరోయిన్‏గా నటిస్తుండగా సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఎన్టీఆర్ ఇటు దేవర సినిమానే కాకుండా అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెడుతున్నారు.ఆయన హిందీలో నటిస్తోన్న మొదటి సినిమా వార్ 2.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్  మెయిన్ రోల్ పోషిస్తున్నారు. గతంలో బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ఇంకా వాణి కపూర్ కలిసి నటించిన సూపర్ హిట్ యాక్షన్ వార్ కు ఈ సినిమా సీక్వెల్. వార్ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సాధించడంతో.. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తీసుకువస్తున్నారు.


 ఈ సినిమాకి బ్రహ్మాస్త్ర మూవీ ఫేమ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో ఎప్పటిలాగే కబీర్ పాత్రలో కనిపించనున్నారు హృతిక్ రోషన్. కానీ తారక్ మాత్రం ఇందులో మెయిన్ విలన్ గా కనిపించనున్నాడని సమాచారం వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఆసక్తికర విషయం ఫీల్మ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.ఈ మూవీ కోసం ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ పేర్లు బయటకు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అలియా భట్ కూడా ఒక ప్రధాన పాత్రతో కనిపించనుందని వినిపించాయి. అయితే ఆ రూమర్స్ పై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న పేరు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. వార్ 2 సినిమాలో కియారా కనిపించనుందని సమాచారం. అయితే ఇందులో కియారా ఎన్టీఆర్ జోడిగా కనిపించనుందని సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ సినిమాలో నటీనటుల గురించి మేకర్స్ నుండి అధికారిక ధృవీకరణ లేదు. ప్రస్తుతం కియారా  రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తుంది.ఈమె టాలీవుడ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అను నేను సినిమా ద్వారా పరిచయం అయ్యింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>