Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indiaf2b91518-a7ae-4432-955e-07d2c4a4f65e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indiaf2b91518-a7ae-4432-955e-07d2c4a4f65e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమై ఉత్కంఠ భరితంగా సాగుతున్న వరల్డ్ కప్ టోర్ని కీలక దశకు చేరుకుంది. నిన్న మొన్నటి వరకు లీక్ మ్యాచ్ లలో అన్ని జట్లు కూడా హోరాహోరీగా తలపడ్డాయి. ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచాయి అని చెప్పాలి. మొత్తంగా 10 టీమ్స్ అటు వరల్డ్ కప్ లో పాల్గొన్నాయి. భారత్ లోని 10 వేదికలపై లీగ్ మ్యాచ్ ఆడాయి. ఈ పది జట్లలో ఆరు టీమ్స్ ఎలిమినేట్ అవ్వగా.. భారత్ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మాత్రమే అటు సెమీఫైనల్కుIndia{#}Sri Lanka;England;Australia;Cricket;Pakistan;New Zealand;World Cup;Indiaసెమీఫైనల్స్ లో.. ఇండియా ఇప్పటివరకు ఎన్నిసార్లు గెలిచిందంటే?సెమీఫైనల్స్ లో.. ఇండియా ఇప్పటివరకు ఎన్నిసార్లు గెలిచిందంటే?India{#}Sri Lanka;England;Australia;Cricket;Pakistan;New Zealand;World Cup;IndiaTue, 14 Nov 2023 07:40:00 GMTప్రస్తుతం భారత్ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమై ఉత్కంఠ భరితంగా సాగుతున్న వరల్డ్ కప్ టోర్ని కీలక దశకు చేరుకుంది. నిన్న మొన్నటి వరకు లీక్ మ్యాచ్ లలో అన్ని జట్లు కూడా హోరాహోరీగా తలపడ్డాయి. ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచాయి అని చెప్పాలి. మొత్తంగా 10 టీమ్స్ అటు వరల్డ్ కప్ లో పాల్గొన్నాయి. భారత్ లోని 10 వేదికలపై లీగ్ మ్యాచ్ ఆడాయి. ఈ పది జట్లలో ఆరు టీమ్స్ ఎలిమినేట్ అవ్వగా.. భారత్ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మాత్రమే అటు సెమీఫైనల్కు అవకాశం దక్కించుకున్నాయి.


 కాగా ఇక రేపటి నుంచి సెమీఫైనల్ మ్యాచులు ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పాలి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది అని చెప్పాలి. అయితే ఇలాంటి కీలకమైన మ్యాచ్ జరుగుతున్న సమయంలో గత గణాంకాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. గత రికార్డులను బట్టి ప్రస్తుత మ్యాచ్లో జట్టు ప్రదర్శనను అంచనా వేయడం చేస్తూ ఉంటారు ప్రేక్షకులు.


 అయితే సెమీఫైనల్ పోరులో భారత జట్టు రికార్డులు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుంటే.. 1983లో జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ పై భారత జట్టు విజయం సాధించింది. 1987లో ఇక ఇంగ్లాండ్ చేతిలో సెమి ఫైనల్లో ఓడిపోయింది భారత్. 1996 లోను ఇదే రిపీట్ అయింది. శ్రీలంక చేతిలో ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. 2003లో కెన్యాపై గెలిచిన భారత్.. 2011లో పాకిస్తాన్ పై కూడా ఘనవి విజయాన్ని అందుకుంది. 2015లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియా.. 2019లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలై ఇంటి బాట పట్టింది. ఇక ఇప్పుడు 2023 వరల్డ్ కప్ లో సెమిస్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>