Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlib60e2fc4-5b31-4a70-8c96-2bc73a207f10-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlib60e2fc4-5b31-4a70-8c96-2bc73a207f10-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ అదరగొడుతున్నాడు. ఇక ఇప్పటికే ఎన్నో వందల రికార్డులను.. కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు సరికొత్త రికార్డులను సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ఇక భారత జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అభిమానులు అందరూ కూడా ఎన్నో రKohli{#}VIRAT KOHLI;Cricket;Sri Lanka;World Cup;Indiaఅవును.. కోహ్లీ 49వ సెంచరీ గురించి అలా అనడం తప్పే?అవును.. కోహ్లీ 49వ సెంచరీ గురించి అలా అనడం తప్పే?Kohli{#}VIRAT KOHLI;Cricket;Sri Lanka;World Cup;IndiaMon, 13 Nov 2023 08:45:00 GMTప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ అదరగొడుతున్నాడు. ఇక ఇప్పటికే ఎన్నో వందల రికార్డులను.. కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు సరికొత్త రికార్డులను సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ఇక భారత జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు.


 అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అభిమానులు అందరూ కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు విరాట్ కోహ్లీ.  ఏకంగా వన్డే ఫార్మాట్లో 49 వ సెంచరీని సాధించి సచిన్ రికార్డును సమం చేశాడు. అయితే తన పుట్టినరోజు నాడే కోహ్లీ ఇలా సెంచరీ చేసి అరుదైన మైలురాయిని అందుకోవడం రమనార్హం. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ సెంచరీపై క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపించింది.  49 సెంచరీలు చేసిన కోహ్లీ సచిన్ రికార్డును బద్దలు కొట్టడం ఖాయం అని అందరూ కామెంట్ చేశారు.


 కానీ ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ 49వ సెంచరీ గురించి శ్రీలంక జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న కుషాల్ మెండిస్ ప్రవర్తించిన తీరు సంచలనంగా మారిపోయింది. దీంతో సోషల్ మీడియాలో కోహ్లీ ఫ్యాన్స్ అతని ట్రోల్ చేశారు. తాను కోహ్లీ సెంచరీని ఎందుకు అభినందించాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు కుషాల్ మెండిస్. అయితే ఇటీవల ఇదే విషయం గురించి మాట్లాడాడు. ఆ రోజు నేను మాట్లాడింది తప్పే  దానికి నిజంగా బాధపడుతున్న. విరాట్ కోహ్లీ 49వ సెంచరీ గురించి అప్పటికి నాకు తెలియదు. రిపోర్టర్ సడన్గా ఆపరేషన్ అడగడంతో అర్థం కాలేదు. వన్ డే ఫార్మాట్లో అన్ని శతకాలు బాదటం అనేది అంత సులభమైన విషయం కాదు అంటూ కుశాల్ మెండిస్ వ్యాఖ్యానించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>