MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfcc1a397-37e3-42c4-bc1d-124854020d56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfcc1a397-37e3-42c4-bc1d-124854020d56-415x250-IndiaHerald.jpg హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు రవితేజ. ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు. ఈ ఏడాది 'రావణాసుర'(Ravanasura) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. 'రావణాసుర' వంటి ప్లాప్ తర్వాత రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ కెరీర్ లోనే మొట్టమొదటి tollywood{#}Amazon;Akkineni Nageswara Rao;ravi teja;Ravi;Box office;December;Hindi;Audience;India;November;Heroine;October;Chitram;Telugu;Cinemaఓటీటీలోకి వచ్చేస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు..!!ఓటీటీలోకి వచ్చేస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు..!!tollywood{#}Amazon;Akkineni Nageswara Rao;ravi teja;Ravi;Box office;December;Hindi;Audience;India;November;Heroine;October;Chitram;Telugu;CinemaMon, 13 Nov 2023 16:00:00 GMT హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు రవితేజ. ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు. ఈ ఏడాది 'రావణాసుర'(Ravanasura) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. 'రావణాసుర' వంటి ప్లాప్ తర్వాత రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇది. దీంతో ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో నిర్వహించి సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు. 

రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే సినిమా నిడివి మూడు గంటలు ఉండడంతో ఈ విషయంలో ఆడియన్స్ కొంత ఆసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో అప్రమత్తమైన మూవీ టీం కొన్ని రోజుల తర్వాత సినిమా నిడివి తగ్గించడంతో 'టైగర్ నాగేశ్వరావు' మూవీకి బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో తప్పితే హిందీ తో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఈ మూవీని త్వరలోనే ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. ముందుగా ఈ సినిమాని డిసెంబర్ నెలలో ఓటీటీ రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ సినిమా రిజల్ట్ కారణంగా కాస్త ముందుగానే విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. 

నవంబర్ 24న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 'టైగర్ నాగేశ్వరరావు' స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. 'టైగర్ నాగేశ్వరావు' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సుమారు రూ.15 కోట్లకు దక్కించుకుంది. ఈ క్రమంలోనే నవంబర్ 24న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతోపాటు మిగతా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>