Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak9a26c0fe-f7e7-4af6-b61b-2d531a5bcda1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak9a26c0fe-f7e7-4af6-b61b-2d531a5bcda1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అటు పాకిస్తాన్ జట్టు ప్రదర్శన గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అత్యంత చెత్త ప్రదర్శన చేసిన పాకిస్తాన్ ఇక వరల్డ్ కప్ టోర్ని నుంచి లీగ్ దశతోనే సరిపెట్టుకుని ఎలిమినేట్ అయిపోయింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ విభాగం అని చెప్పుకునే పాకిస్తాన్ బౌలర్లు.. ఈ వరల్డ్ కప్ లో ఎక్కడ ప్రభావం చూపలేకపోయారు. ఏకంగా భారీగా పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డులు కూడా మూటగట్టుకున్నారు అని చెప్పాలి. అయితే భారత గడ్డపPak{#}Anu Malik;Pakistan;World Cup;Indiaభారత్ ని చూసి.. పాకిస్తాన్ చాలా నేర్చుకోవాలి : షోయబ్ మాలిక్భారత్ ని చూసి.. పాకిస్తాన్ చాలా నేర్చుకోవాలి : షోయబ్ మాలిక్Pak{#}Anu Malik;Pakistan;World Cup;IndiaMon, 13 Nov 2023 08:50:00 GMTప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అటు పాకిస్తాన్ జట్టు ప్రదర్శన గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అత్యంత చెత్త ప్రదర్శన చేసిన పాకిస్తాన్ ఇక వరల్డ్ కప్ టోర్ని నుంచి లీగ్ దశతోనే సరిపెట్టుకుని ఎలిమినేట్ అయిపోయింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ విభాగం అని చెప్పుకునే పాకిస్తాన్ బౌలర్లు.. ఈ వరల్డ్ కప్ లో ఎక్కడ ప్రభావం చూపలేకపోయారు. ఏకంగా భారీగా పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డులు కూడా మూటగట్టుకున్నారు అని చెప్పాలి.


 అయితే భారత గడ్డపై భారత జట్టును దెబ్బ కొట్టాలి అనే లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కు.. ఎక్కడ కాలం కలిసి రాలేదు. జట్టులో ఉన్న ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయలేక.. ఇక జట్టు పూర్తిగా డీలా పడిపోయింది అని చెప్పాలి. దీంతో చిన్న టీమ్స్ చేతుల్లో సైతం పాకిస్తాన్ ఓడిపోవడం.. ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకవైపు భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంటే.. టీమిండియాను దెబ్బ కొట్టాలనుకున్న పాకిస్తాన్ మాత్రం చతికిలబడిపోయింది. దీంతో ఎంతో మంది పాకిస్తాన్ మాజీలు టీమ్ ఇండియా పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటే.. ఇక పాకిస్తాన్ ఆట తీరును ఎండగడుతున్నారు.



 ఈ క్రమంలోనే ఇలా వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడం గురించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వరల్డ్ కప్ లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లోనే కాకుండా అన్ని అంశాల్లో కూడా రాణిస్తుంది. ఆటగాళ్లు గాయాల బారిన పడిన.. వాళ్ళు ప్లాన్ బి లో ఉన్నారు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టు పునర్నిర్మానానికి ఎంతగానో కృషి చేస్తుంది. కానీ తీసుకునే నిర్ణయాలకు మాత్రం ఎప్పుడూ కట్టుబడి ఉండదు అంటూ షోయబ్ మాలిక్ వ్యాఖ్యానించాడు.  ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా టీమిండియాను చూసి నేర్చుకోవాలి అంటూ సూచించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>